Lagacharla Incident: లగచర్ల ఎపిసోడ్‌లో కీలక మలుపు.. కోర్టులో లొంగిపోయిన సురేష్.. ఢిల్లీలోనే బాధిత కుటుంబాలు
అన్‌స్టాపబుల్‌గా సాగుతున్న లగచర్ల ఎపిసోడ్‌లో ప్రతి అప్‌డేట్ వెరీ ఇంట్రెస్టింగ్‌గా మారుతోంది. కలెక్టర్‌పై దాడి, ఆవెంటనే పట్నం అరెస్ట్, రిమాండ్ రిపోర్ట్‌లో కేటీఆర్ పేరు. ఆతర్వాత గులాబీ నేతల వ్యతిరేకగళం.. అటు హస్తంనేతల ఆగ్రహం. ఇలా ఒక్కటేంటి పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఈ ఇష్యూ ఢిల్లీకి వెళ్లి రీసౌండ్ చేస్తుంటే... లేటెస్ట్‌గా ప్రధాన నిందితుడు బోగమోని సురేష్ లొంగిపోవడంతో కేసు కీలక మలుపు తిరిగింది.
కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన రాళ్ల దాడి ఘటన రాజకీయంగా సంచలనంగా మారింది.. ఓవైపు అరెస్టులు.. మరోవైపు పరామర్శలు… ఇంకోవైపు ఢిల్లీలో బాధితుల ఫైటింగ్… ఇష్యూ ఇలా నడుస్తుండగా లేటెస్ట్‌గా ప్రధాన నిందితుడు లొంగిపోవడంతో కేసు కీలక మలుపు తిరిగింది. A2గా ఉన్న బోగమోని సురేష్ కొడంగల్ కోర్టులో సరెండర్ అయ్యారు. కోర్టు 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో సంగారెడ్డి జైలుకు తరలించారు. ఇదే కేసులో నీరటి సురేష్‌తో పాటు హనుమంతును అరెస్ట్ చేసిన పోలీసులు… ముమ్మరంగా విచారిస్తున్నారు.
మేజిస్ట్రేట్ ముందు లొంగిపోయిన బోగమోని సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నించే గొంతుని ఎవరు ఆపలేరు… రైతుల కోసం మళ్ళీ తిరిగి వస్తా.. పోరాటం కొనసాగిస్తానన్నారు.
ఇక లగచర్ల ఘటనపై NHRCకి ఫిర్యాదు చేశారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. కస్టడీలో రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం నియోజకవర్గంలో ప్రజలకు రక్షణ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందాలు లగచర్లలో పర్యటించి…రైతులకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు ఈటల.
ఇటు రెండో రోజు కూడా ఢిల్లీలోనే ఉన్నారు లగచర్ల బాధితులు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసేవరకు ఢిల్లీని వీడేది లేదంటున్నారు. తమ గోడు వినిపించాల్సిందే… భూములను కాపాడుకోవాల్సిందేంటున్నారు. రైతులకు మద్దతుగా వెళ్లిన బీఆర్ఎస్ నేతలు.. రాష్ట్రపతి ఆఫీస్‌కు సమాచారమిచ్చి అపాయింట్‌మెంట్ కోరారు. రాష్ట్రపతి పిలుపు కోసం ఎదరుచూస్తున్నారు.
ఇప్పటికే లగచర్ల బాధితులు ఎస్సీ,ఎస్టీ, మహిళా, మానవ హక్కుల కమిషన్లను ఆశ్రయించి లిఖితపూర్వక ఫిర్యాదులిచ్చారు. ఫార్మా కంపెనీకి భూమి ఇచ్చేది లేదంటూ 9 నెలలుగా ఆందోళన చేస్తున్నా.. తమపై వేధింపులు కొనసాగుతున్నాయని ఫిర్యాదులో పేర్నొన్నారు. దాదాపు 500 మంది పోలీసులొచ్చి తమపై దౌర్జన్యకాండకు పాల్పడ్డారని, ఎదురుతిరిగిన వారిని జైలుపాలు చేశారని ఆరోపించారు.
ఇటు లగచర్ల ఉదంతంపై ఎంక్వైరీ స్టార్ చేసింది జాతీయ ఎస్టీ కమిషన్. వికారాబాద్ జిల్లా రోటిబండ తండాకు వెళ్లిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు.. అక్కడి బాధితులతో మాట్లాడారు. ముఖ్యంగా మహిళలను అడిగి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఫార్మా కంపెనీకి భూసేకరణ ఎలా జరుగుతోంది…? అధికారులు, పోలీసుల తీరు ఎలా ఉంది…? అంటూ లోతుగా విచారిస్తోంది ఎస్‌టీ కమిషన్.
మొత్తంగా… ఇటు A2 బోగమోని సురేష్ లొంగిపోవడం… అటు బాధిత కుటుంబాలతో పాటు బీఆర్ఎస్ నేతలు ఇంకా ఢిల్లీలోనే ఉండటంతో లగచర్ల ఇష్యూ ఇంకాస్త సీరియస్‌గా మారింది. ఇలా ఈ ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..