AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Special Olympics Bharat: న్యూఢిల్లీలో స్పెషల్ ఒలింపిక్స్ ఆసియా పసిఫిక్ క్రీడలు.. వారి కోసం ప్రత్యేకంగా..

న్యూ ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో నవంబర్ 22వ తేదీ వరకు ఇంటెలిక్చువల్ డిజెబిలిటీ కలిగిన వికలాంగులకు స్పెషల్ ఒలింపిక్స్ ఆసియా పసిఫిక్ క్రీడలు జరగనున్నాయి..

Special Olympics Bharat: న్యూఢిల్లీలో స్పెషల్ ఒలింపిక్స్ ఆసియా పసిఫిక్ క్రీడలు.. వారి కోసం ప్రత్యేకంగా..
Special Olympics Bharat
Srilakshmi C
|

Updated on: Nov 19, 2024 | 8:52 PM

Share

న్యూఢిల్లీ, నవంబర్‌ 19: పిల్లల్లో నేర్చుకోవడంలో హెచ్చుతగ్గులు ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే తార్కికంగా ఆలోచించే సామర్థ్యం, త్వరగా నిర్ణయాలు తీసుకునే శక్తి, సమస్యలను పరిష్కరించుకోగల సామర్థ్యాలను బట్టి వారి ప్రజ్ఞా సామర్ధ్యాలను అంచనా వేస్తుంటారు. మేథోశక్తి లోపిస్తే వారిని మేథోశక్తి లోపాలున్న (ఇంటెలిక్చువల్ డిజెబిలిటీ) పిల్లలుగా వైద్యులు చెబుతుంటారు. ఈ విధమైన మేధోపరమైన వికలాంగులలో క్రీడల అభివృద్ధికి, స్పెషల్ ఒలింపిక్స్ ఇండియా (SOB) వారి సామర్థ్యాల గురించి అవగాహన కల్పించడానికి, దానిని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి స్పెషల్ హార్మొనీ కార్యక్రమాన్ని తాజాగా నిర్వహించింది. నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (NSF) మేధో వికలాంగ ఆటగాళ్ల కోసం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు అమిత్ కుమార్‌తో పాటు 15 మంది డిజేబుల్డ్‌ పిల్లలు కూడా పాల్గొన్నారు.

న్యూ ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో నవంబర్ 17 (ఆదివారం) జరిగిన ఈ కార్యక్రమంలో మేధో వైకల్యం ఉన్నవారి స్ఫూర్తి, ప్రతిభను చాటే సంగీత కార్యక్రమం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ, స్పెషల్ ఒలింపిక్స్ ఇండియా అధ్యక్షురాలు మల్లికా నడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లికా నడ్డా మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం కేవలం ప్రదర్శన మాత్రమే కాదు. ఈ పిల్లలను శక్తివంతం చేయడం అని అన్నారు. నవంబర్ 22వ తేదీ వరకు త్యాగరాజ స్టేడియంలో జరగనున్న స్పెషల్ ఒలింపిక్స్ ఆసియా పసిఫిక్ బౌచి, బౌలింగ్ పోటీలకు సంబంధించి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రీడల కోసం స్పెషల్ ఒలింపిక్స్ ఇండియా ఇటీవల 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. బౌచి పోటీకి 4-4 మంది మహిళలు, పురుషుల జట్లు ఎంపిక చేశారు.

పురుషుల జట్టులో కబీర్ ప్రీతమ్ బారువా, ఎబినేజర్ డేవిడ్, విల్ఫ్రెడ్ డిసౌజా, దేవాన్ష్ అగర్వాల్‌లు చోటు దక్కించుకున్నారు. మహిళా జట్టులో ప్రియాంక, మంజుల, పూర్ణిమ మదన్, జి సుభాషిణిలకు చోటు దక్కింది. రెండు జట్లకు ఇద్దరు కోచ్‌లు ఉంటారు. అదేవిధంగా బౌలింగ్ ఈవెంట్ కోసం కూడా 4-4 మహిళా, పురుషుల జట్లను ఎంపిక చేశారు. ఈ రెండు జట్లలోనూ 2-2 కోచ్‌లు ఉంటారు. మహిళల జట్టులో నేహా సింగ్, సిమ్రాన్ పుజారా, శ్రద్ధా పటేల్, శ్రీమతి సంగీతా నాయక్ ఉండగా.. పురుషుల జట్టులో ఇభానన్ సాహు, అంకిత్, ప్రకాష్ వాఘేలా, నిరుపమ్ డే ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు