TSPSC: NOC తీసుకోకుండానే ఎగ్జామ్ రాసిన ఉద్యోగులు.. ఆలస్యంగా గుర్తించిన టీఎస్‌పీఎస్సీ..

సిట్ విచారణలో టీఎస్‌పీఎస్ అక్రమాల డొంక కదులుతోంది. ఒక్కొక్కరుగా దొంగలంతా బయటికొస్తున్నారు. కమిషన్‌ నుంచి NOC తీసుకోకుండానే కొందరు ఉద్యోగులు ఎగ్జామ్ రాసినట్లుగా గుర్తించారు అధికారులు..

TSPSC: NOC తీసుకోకుండానే ఎగ్జామ్ రాసిన ఉద్యోగులు.. ఆలస్యంగా గుర్తించిన టీఎస్‌పీఎస్సీ..
TSPSC Paper Leak
Follow us

|

Updated on: Mar 23, 2023 | 12:20 PM

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తవ్వేకొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయ్‌. చైన్‌ లింక్‌ మాదిరిగా ఒకర్ని పట్టుకుంటే మరొకరు దొరుకుతున్నారు. ఇప్పటివరకు ఇంటి దొంగలు ఇద్దరే అనుకుంటే, ఇప్పుడు మరికొందరు ఇంటిదొంగల వ్యవహారం బయటకొచ్చింది. టీఎస్‌పీఎస్సీలో పని చేస్తున్న ఉద్యోగులు ఎలాంటి అనుమతి తీసుకోకుండా పరీక్ష రాసినట్లుగా  తెలుస్తోంది. వీరంతా NOC తీసుకోకుండా గ్రూప్‌-1 ఎగ్జామ్ రాసినట్లుగా గుర్తించారు. ఇందులో మొత్తం 26మంది టీఎస్‌పీఎస్ ఉద్యోగులు ఉనట్లుగా తేల్చారు.   కమిషన్‌ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోకుండానే ఎగ్జామ్ రాశారు ఉద్యోగులు.  4నెలల లీవ్‌లు వాడుకోకుండానే ఎగ్జామ్ రాశారు పర్మినెంట్ ఉద్యోగులు. అదే విధంగా ఉద్యోగానికి రిజైన్ చేయకుండా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఎగ్జామ్ రాశారని తేల్చిరు. ఇప్పటికీ ఉద్యోగంలోనే కొనసాగుతున్నారు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు.

TSPSC ఉద్యోగుల్లో చాలా మంది గ్రూప్‌-1 రాస్తే అందులో 10మంది క్వాలిఫై కావడం, వాళ్లల్లో కొందరికి 100కి పై మార్కులు రావడం అనుమానాలు రేపుతున్నాయి. ఈ 10మందిలో ముగ్గురు ముగ్గురు ఔట్‌ సోర్సింగ్ సిబ్బంది కాగా, ఏడుగురు రెగ్యులర్ ఉద్యోగులు. దాంతో, ముందు ఇంటి దొంగలపై ఫోకస్‌ పెట్టింది సిట్‌. గ్రూప్‌-1 ఎగ్జామ్‌ రాసిన TSPSC ఉద్యోగులకు పేపర్‌ లీకేజీతో సంబంధముందా? లేదా? అనే కోణంలో దర్యాప్తు చేస్తోంది సిట్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం