Revanth meets Jaggareddy: ఉప్పు-నిప్పు ఏకమయ్యాయి.. సీఎల్పీలో కీలక సన్నివేశం.. జగ్గారెడ్డిని కలిసిన రేవంత్ రెడ్డి

|

Mar 11, 2022 | 1:44 PM

గత కొంతకాలంలో అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎప్పుడూ ఉప్పు నిప్పులా ఉండే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఏకమయ్యారు.

Revanth meets Jaggareddy: ఉప్పు-నిప్పు ఏకమయ్యాయి.. సీఎల్పీలో కీలక సన్నివేశం.. జగ్గారెడ్డిని కలిసిన రేవంత్ రెడ్డి
Revanth Meets Jaggareddy
Follow us on

Revanth meets Jaggareddy: గత కొంతకాలంలో అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న తెలంగాణ(Telangana) కాంగ్రెస్ పార్టీ(Congress)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎప్పుడూ ఉప్పు నిప్పులా ఉండే పీసీసీ చీఫ్(PCC Chief) రేవంత్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే(Sangareddy MLA) జగ్గారెడ్డి ఏకమయ్యారు. ఇద్దరు నేతల మధ్య భేదాభిప్రాయాలు పక్కనబెట్టి ఇద్దరు నేతలు కలుసుకున్నారు. ఈ సన్నివేశం కాంగ్రెస్ శాసనసభ పక్ష కార్యాలయంలో చోటుచేసుకుంది. సీఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డితో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రత్యేకంగా సమావేశమైన ఇద్దరు నేతలు.. దాదాపు 20 నిమిషాలకు పైగా ఇద్దరు నేతలు చర్చలు జరిపారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు, ఇద్దరు మధ్య సయోధ్య కుదినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇదిలావుంటే, పీసీసీ చీఫ్ అశించి భంగపడ్డ జగ్గారెడ్డి గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అంతేకాదు పీసీసీ చీఫ్‌పై బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు. కాగా, మరఅధికార టీఆర్ఎస్, విపక్షాల్లో ఒకటైన బీజేపీ పోటాపోటీగా బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం అంతర్గత కుమ్ములాటలతో ఎదురీదుతోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నా.. ఆ పార్టీలోని కొందరు నేతలు ఆయన తీరు పట్ల అసంతృప్తితో ఉన్నారు. ఆ నేతల జాబితాలో జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాస్త ముందు వరుసలో ఉన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కూల్ చేసే విషయంలో రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇటీవల ఆయన ఇంటికి వెళ్లి చర్చలు జరపడంతో కోమటిరెడ్డి కాస్త మెత్తపడ్డట్లు టాక్ వినిపిస్తోంది. అయితే జగ్గారెడ్డి విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం అచితూచి వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి తీరుపై మొదటి నుంచి అసంతృప్తితో ఉన్న జగ్గారెడ్డి.. సందర్భం దొరికినప్పుడల్లా ఆయనను టార్గెట్ చేస్తున్నారు. అయినప్పటికీ భేదాభిప్రాయాలే తప్ప విభేదాలు కావుని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కుటుంబంలో కలహాలు ఉన్నట్టే పార్టీలో చిన్న చిన్న మనస్పర్థలు ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ది భిన్నత్వంలో ఏకత్వమని, ప్రాంతీయ పార్టీల్లో ఏకత్వంలో మూర్ఖత్వం ఉంటుందని అన్నారు.

తాజాగా ఇద్దరి కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎల్సీ కార్యాలయంలో సమావేశమైన రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి పార్టీ బలోపేతంపై చర్చించినట్లు సమాచారం. త్వరలోనే ఎన్నికల వస్తాయన్న వార్తల నేపథ్యంలో ఇద్దరు నేతల భేటీ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహన్ని తీసుకువచ్చింది. కాగా, రేవంత్ రెడ్డి వ్యుహాత్మకంగా వ్యవహరిస్తూ.. పాత కొత్త నేతల కలయికతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.