తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్న రజత్ కుమార్‌ని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది ప్రభుత్వం.. కొత్త సీఈవో కోసం రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు పేర్లను పంపించగా… మూడు పేర్లను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం.. చివరకు శశాంక్ గోయల్ పేరును ఖరారు చేసింది. కాగా, 1990 బ్యాచ్‌కు చెందిన డాక్టర్ శశాంక్ గోయల్ ప్రస్తుతం తెలంగాణ కార్మిక, పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు.