Telangana: హాస్టల్​కి వచ్చిన నాన్న తనను వెంట తీసుకెళ్లలేదని..

|

Nov 22, 2021 | 9:34 PM

 చిన్న చిన్న కారణాలతో టీనేజర్స్ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. నిండు భవిష్యత్‌ను, జన్మనిచ్చిన తల్లిదండ్రులను పట్టించుకోకుండా తనువు చాలిస్తున్నారు.

Telangana: హాస్టల్​కి వచ్చిన నాన్న తనను వెంట తీసుకెళ్లలేదని..
Suicide Attempt
Follow us on

చిన్న చిన్న కారణాలతో టీనేజర్స్ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. నిండు భవిష్యత్‌ను, జన్మనిచ్చిన తల్లిదండ్రులను పట్టించుకోకుండా తనువు చాలిస్తున్నారు. వసతి గృహానికి తనను చైసేందుకు వచ్చిన తండ్రి..  ఇంటికి తీసుకెళ్లలేదనే మనస్తాపంతో.. ఓ విద్యార్థిని సూసైడ్‌కు యత్నించింది. ఈ ఘటన తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో జరిగింది. తిర్యాని గురుకుల పాఠశాలలో సెవెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థినిని చూసేందుకు.. ఆదివారం ఆమె తండ్రి అక్కడకు వెళ్లారు. అయితే.. తనను ఇంటికి తీసుకెళ్లాలని విద్యార్థిని తండ్రిని కోరింది. కానీ.. బాగా చదువుకోవాలని.. పదే, సదే సెలవులు పెడితే తర్వాత ఇబ్బందులు ఎదురవుతాయంటూ నచ్చజెప్పారు.  దీంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థిని.. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించింది. తోటి విద్యార్థులు గమనించి ఉపాధ్యాయులకు తెలియజేయడంతో.. హాస్పిటల్‌కు తరలించారు. కాగా.. ప్రధాన ప్రశ్న ఏంటంటే… పాఠశాలలోకి పురుగుల మందు ఎలా వెళ్లింది? ఎవరు తీసుకెళ్లారు? అన్నది. ఈ విషయం ఎవరికీ అంతుబట్టడం లేదు.

గురుకుల పాఠశాలలోని ఉపాధ్యాయులు, వార్డెన్ నిర్లక్ష్యానికి ఈ ఘటన నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోందని విద్యార్థి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురుకుల పాఠశాలలోకి విద్యార్థిని పురుగుల మందు ఎలా తీసుకెళ్లిందని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా గురుకుల పాఠశాల అధికారులు మేలుకొని.. ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూడాలని కోరుతున్నారు.

Also Read:  ట్రైన్ వస్తుండగా.. వీడియోకు పోజిద్దామనుకున్నాడు.. విగత జీవిగా మారిపోయాడు..

కారులో వచ్చిన ఈ ఆంటీలు ఏం దొంగతనం చేశారో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్..