గణేష్ నిమజ్జనం రోజున ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు హైదరాబాద్ అడిషనల్ ట్రాఫిక్ సీపీ అనిల్ కుమార్ తెలిపారు. ఎన్నో ఏళ్లనుంచి హైదరాబాద్‌లో జరిగే భారీ గణనాథుని నిమజ్జనం కార్యక్రమం చూసేందుకు భారీగా జనం తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు సీపీ తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంతోమంది భక్తులు ఇక్కడకు తరలిరానున్నారని, ఈ కార్యక్రమాన్ని చూసేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. రెండు […]

గణేష్ నిమజ్జనం రోజున ట్రాఫిక్ ఆంక్షలు
Follow us

| Edited By:

Updated on: Sep 10, 2019 | 9:31 PM

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు హైదరాబాద్ అడిషనల్ ట్రాఫిక్ సీపీ అనిల్ కుమార్ తెలిపారు. ఎన్నో ఏళ్లనుంచి హైదరాబాద్‌లో జరిగే భారీ గణనాథుని నిమజ్జనం కార్యక్రమం చూసేందుకు భారీగా జనం తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు సీపీ తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంతోమంది భక్తులు ఇక్కడకు తరలిరానున్నారని, ఈ కార్యక్రమాన్ని చూసేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. రెండు వేల ఒక మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారని సీపీ తెలిపారు. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్ పరిసరాల్లో ప్రైవేటు వాహనాలకు అనుమతి రద్దు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ప్రజలు ఆర్టీసీ బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్ లలో మాత్రమే ప్రయాణించాలని సీపీ అనిల్ కుమార్ విఙ్ఞప్తి చేశారు.