Vande Bharat Express: సికింద్రాబాద్‌- తిరుపతి ‘వందేభారత్‌’ ట్రైన్ టికెట్ ధరలు ఇవే..

|

Apr 07, 2023 | 4:51 PM

హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వాళ్ల కోసం.. వందే భారత్ రైలును అందుబాటులోకి తీసుకురాబోతోంది రైల్వేశాఖ. అయితే ఈ సర్వీసులు ఎప్పటి నుంచి మొదలవుతాయి? ఏయే స్టేషన్లలో ఆగుతుంది? టైమింగ్స్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ?

Vande Bharat Express: సికింద్రాబాద్‌- తిరుపతి ‘వందేభారత్‌’ ట్రైన్ టికెట్ ధరలు ఇవే..
Vande Bharat Rail
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే విశాఖ – సికింద్రాబాద్ మధ్య వందేభారత్ రైలు నడుస్తోంది. ఇప్పుడు రెండో వందే భారత్ రైలు పట్టాలెక్కబోతోంది. ఈనెల 8న దీనిని ప్రారంభించబోతున్నారు ప్రధాని మోదీ. ఈ రైలు సికింద్రాబాద్-తిరుపతి మధ్య అందుబాటులోకి రానుంది. ఈ ట్రైన్‌లో సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లడానికి ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది.  ఈ నెల 8న ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుందీ ట్రైన్. తొలి రోజు కాబట్టి సాధారణ ప్రయాణికులను అనుమతించరు. ఏప్రిల్ 9న తిరుపతి- సికింద్రాబాద్ మార్గంలో మాత్రమే నడుస్తుంది. ఇక 10వ తేదీ నుంచి మాత్రం పూర్తి స్థాయిలో సర్వీసులు అందుబాటులో ఉంటాయి. మొత్తం 660కిలోమీటర్ల దూరాన్ని కేవలం 8గంటల 30నిముషాల్లోనే చేరుకుంటుంది. నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరులో మాత్రమే స్టాప్స్ ఉంటాయి.

ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరే ఈ రైలు.. మద్యాహ్నం 2గంటల 30 నిముషాలకు తిరుపతి చేరుకుంటుంది. మళ్లీ సాయంత్రం 3 గంటల 15 నిముషాలకు తిరుపతి నుంచి రిటర్న్ బయలు దేరుతుంది. అర్ధరాత్రి 11 గంటల45నిముషాలకు సికింద్రాబాద్ చేరుకుంటుందీ వందేభారత్ ఎక్స్‌ప్రెస్. తాజాగా టికెట్ల ధరలు ప్రకటించింది సౌత్ సెంట్రల్ రైల్వే. సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి ఏసీ ఛైర్‌కార్‌ టికెట్‌ ధర రూ.1680 కాగా.. ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌ కార్‌ టికెట్‌ రేటును రూ.3080లుగా ఫిక్స్ చేశారు. అదే మాదిరిగా, తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ఏసీ ఛైర్‌కార్‌ టికెట్‌ రేటు రూ.1625 కాగా.. ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌ కార్‌ టికెట్‌ ధరను రూ.3030 అని తెలిపారు.

సికింద్రాబాద్‌-తిరుపతి టికెట్‌ ధరలను పరిశీలిస్తే బేస్‌ ఫేర్‌ రూ.1168 ఉండగా…  సూపర్‌ ఫాస్ట్‌ ఛార్జీ రూ.45, రిజర్వేషన్‌ ఛార్జీ రూ.40, టోటల్ జీఎస్టీ రూ.63 అని వివరించారు. రైల్లో అందజేసే ఫుడ్‌కు రూ.364 చొప్పున ఒక్కో పాసింజర్ నుంచి క్యాటరింగ్‌ ఛార్జీ వసూలు చేయనున్నారు. అదే తిరుపతి- సికింద్రాబాద్ రైల్లో బేస్‌ ఛార్జీని రూ.1169 ఉంటుందని వివరించారు. కేటరింగ్‌ ఛార్జీని రూ.308గా మాత్రమే అని వెల్లడించారు. దీంతో రాను, పోను ఛార్జీల్లో తేడాలు కనిపించాయి.

సికింద్రాబాద్‌ నుంచి ఒక్కో స్టేషన్‌కు ఛైర్‌కార్‌ ఛార్జీలు ఇలా.

సికింద్రాబాద్ టూ నల్గొండ – రూ.470

సికింద్రాబాద్ టూ గుంటూరు – రూ.865

సికింద్రాబాద్ టూ ఒంగోలు – రూ.1075

సికింద్రాబాద్ టూ నెల్లూరు – రూ.1270

ఎగ్జిక్యూటివ్‌ సెక్షన్ ఛార్జీలు ఇలా

సికింద్రాబాద్ టూ నల్గొండ – రూ.900

సికింద్రాబాద్ టూ గుంటూరు – రూ.1620

సికింద్రాబాద్ టూ ఒంగోలు – రూ.2045

సికింద్రాబాద్ టూ నెల్లూరు – రూ.2455

 

ఈ ట్రైన్‌లో మొత్తం 4 చైర్ కార్, 4 ఎగ్జిక్యూటివ్ ఛైర్ కారు కోచ్‌లు ఉంటాయి. మంగళవారం మినహా మిగిలిన 6 రోజులు సర్వీసులు నడుస్తాయి. కోచ్‌లో 32 అంగుళాల డిజిటల్‌ స్క్రీన్‌ ఉంటుంది. రైలు వేగంతో సహా అన్ని వివరాలు డిస్‌ప్లే అవుతాయి. లోపల బయట సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. ట్రైన్‌ లోపల వైఫై సౌకర్యంతో పాటు ప్రతి కోచ్‌లో 4 ఎమర్జన్సీ లైట్లు అమర్చారు. ఇక ప్రమాదాల నివారణపైనా ప్రత్యేక దృష్టి పెట్టింది రైల్వేశాఖ. అందులో భాగంగానే ఎదురుగా రైలొస్తే ఢీ కొట్టకుండా కవచ్‌ టెక్నాలజీని తీసుకొచ్చారు. ఫుల్లీ సస్పెండెడ్‌ ట్రాక్షన్‌ మోటార్‌తో రూపొందించిన ఆధునిక బోగీలను ఈ రైలులో వినియోగించారు. రైలు ఎంత వేగంతో వెళ్లినా కుదుపులు ఉండవు. 180 డిగ్రీల కోణంలో తిరిగే సీట్లు ఈ ట్రైన్‌ ప్రత్యేకత.

ఔట్‌ సైడ్‌ నుంచి అదిరిపోయే లుక్‌, ఇన్‌సైడ్‌లో ఓ రేంజ్‌లో ఉండే ఫెసిలిటీస్‌తో ఇప్పటికే అందరిని ఆకట్టుకుంటోంది వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపు దిద్దుకోవడం దీని ప్రత్యేకత. ఇప్పటికే దేశంలో నడుస్తున్న వందేభారత్ రైళ్లకు మంచి డిమాండ్ ఉంది. ఇక తిరుపతి వెళ్లే భక్తులు, ప్రయాణికులకు ఇది మరింత సౌకర్యంగా ఉండబోతోంది. కాబట్టి ఈ ట్రైన్‌కు కూడా మంచి ఆదరణ వస్తుందని ఆశిస్తోంది రైల్వేశాఖ.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం