కాలేజీ గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్ వెంటిలేటర్‌పై అనుమానాస్పద గుర్తులు.. 300 వీడియోలు తీశారని అనుమానాలు.!
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు హాస్టల్‌లో కెమెరాల వివాదం ఇంకా కళ్లముందు కదలాడుతుండగానే మరో షాకింగ్ సీన్ తెరపైకి వచ్చింది. ఈసారి ఇలాంటి ఘటన జరిగింది హైదరాబాద్ శివారులోని కాలేజ్ హాస్టల్‌లో.. మేడ్చల్ జిల్లా కండ్లకోయ CMR కాలేజీలోని లేడీస్ హాస్టల్‌లో కొందరు కెమెరాలు పెట్టారనే న్యూస్ ఇప్పుడు షేక్ చేస్తోంది..
మేడ్చల్ జిల్లా కండ్లకోయ CMR ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. హాస్టల్‌లో తమకు భద్రత కరువైందంటూ ఆరోపిస్తున్నారు. బాత్‌రూమ్‌లో వీడియోలు తీశారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో క్యాంపస్ దగ్గర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థుల నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఏడుగురని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వారి నుంచి 12 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రేపటి వరకు చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరిక జారీ చేశాయి. 31న సెలబ్రేషన్స్‌లో భాగంగా హాస్టల్‌లో డీజే ఏర్పాటు చేశారు. ఈవెంట్ తర్వాత అమ్మాయిలంతా హాస్టల్‌కు వెళ్లిన టైమ్‌లో బాత్ రూమ్‌లో కెమెరాను గమనించి కంప్లైట్ చేశారు. హాస్టల్ బాత్రూమ్ వెంటిలేటర్‌పై చేతిగుర్తులు ఉన్నట్టు గుర్తించారు.. బయటి నుంచి కెమెరా పెట్టినట్టుగా అద్దంపై గుర్తులు ఉండగా.. రాత్రి ఒంటిగంటకు కెమెరాను ఓ విద్యార్థిని గుర్తించింది. రెండుమూడు చోట్ల కెమెరాలు పెట్టినట్టుగా విద్యార్ధినిలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
హాస్టల్ అమ్మాయిల ఆరోపణలు..
1. రాత్రిపూట లేడీస్ హాస్టల్‌వైపు అబ్బాయులు వస్తున్నారు
2. హాస్టల్ దగ్గర సరైన సెక్యూరిటీ లేదు
3. లేడీస్ హాస్టల్‌కి, వర్కర్స్ ఉండే ప్లేస్‌కి మధ్య అడ్డుగోడ లేదు
4. కంప్లైంట్ చేస్తే బాధితులనే తప్పుపడుతున్నారు.. ఉద్దేశపూర్వకంగా మేమిచ్చిన ఆధారాల్ని చెరిపేశారు..
5. సరైన మేనేజ్‌మెంట్ లేదు.. సరైన సెక్యూరిటీ లేదు..
6. హాస్టల్‌లో వార్డెన్ సిస్టం కూడా సరిగా లేదు
గతంలోనే తమ సమస్యలపై ప్రశ్నించాం. అయినా సరైన యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేదంటున్నారు అమ్మాయిలు. ఇప్పటికైనా పోలీసులు యాక్షన్ తీసుకోవాలని.. తమకు సరైన న్యాయం జరిగేలా చేయాలన్నారు. వీడియోలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఇక లేడీస్ హాస్టల్ బాత్రూమ్ నుంచి అమ్మాయిల వీడియోలు తీసేరనే వార్తలతో పేరెంట్స్‌లో ఆందోళన మొదలైంది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి