Minor Girl Harassment: కామారెడ్డి జిల్లాలో దారుణం వెలుగు చేసింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే బుద్ధిలేకుండా ప్రవర్తించాడు. తల్లిదండ్రులతో సమానమైన ఆ గరువు.. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేకాదు.. వారిని వేధింపులకు గురిచేసాడు. ఓ విద్యార్థికి టీసీ ఇవ్వడంతో.. ఆ కీచక గురువు అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వివరాల్లోకెళితే.. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దీప్లా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కరోనా సమయంలో విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాస్‌లుు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ నిర్ణయాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న దీప్లా.. బాలురతో పాటు బాలికలకూ పాఠ్యాంశాలు బోధించాడు.
అలా ఆన్‌లైన్ క్లాసుల పేరుతో పలువురు విద్యార్థినిల ఫోన్ నెంబర్లను ప్రధానోపాధ్యాయుడు దీప్లా సేకరించాడు. క్లాసుల అనంతరం విద్యార్థినులకు వీడియో కాల్ చేసి.. అసభ్యకర రీతిలో మాట్లాడేవాడు. అయితే, మంగళవారం నాడు రాముు అనే 10వ తరగతి విద్యార్థికి హెచ్ఎం దీప్లా టీసీ ఇవ్వడంతో అతని అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దీప్లా కు సంబంధించి ఓ వీడియో కూడా వైరల్ అవుతోంది. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు దీప్లాపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కీచక ఉపాధ్యాయుడిని వెంటనే విధుల్లోంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.
Also read:
ఒకటి కాదు.. రెండు కాదు కుప్పలు తెప్పలుగా పాములు… కన్నంలో నుంచి బుసలు కొడుతూ వచ్చాయి.. చివరకు