ప్రజంట్ పీక్ సమ్మర్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఎండలు మండిపోతున్నాయి. దీంతో తెలంగానలో మందుబాబులు బీర్లు తెగ తాగేస్తున్నారు. మే నెల 1 వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రికార్డు రేంజ్‌లో బీర్ల అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఈ 18 రోజుల్లో 583 కోట్ల రూపాయలు విలువ చేసే బీర్లు తాగేశారట మందుబాబులు. మొత్తం 35,25,247 కాటన్లు బీర్లు అమ్ముడైనట్లు డేటా చెబుతుంది. ఈ లెక్కన మే నెల ముగిసే టైమ్‌కి ప్రభుత్వ ఖజానాకు కేవలం బీర్లు అమ్మకాల ద్వారానే వెయ్యి కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
ఇక బీర్ సేల్స్‌లో రాష్ట్రంలోనే నల్గొండ జిల్లా టాప్. ఈ జిల్లాలో 48.14 కోట్ల విలువైన బీర్లు తాగేశారు. ఇక కరీంనగర్ సెకండ్ ప్లేస్‌లో ఉంది. ఓవైపు ముదిరిన ఎండలతో పాటు.. పెళ్లిళ్లు, ఫంక్షన్ల సీజన్ కావడంతో లిక్కర్ సేల్స్ విపరీతంగా పెరిగినట్టు అంచనా వేస్తున్నారు అధికారులు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో బీర్ల అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని అబ్కారీ శాఖ అంచనా వేస్తోంది. దీంతో డిమాండ్‌కు తగ్గట్టుగా లిక్కర్ షాపులకు నిత్యం బీరు సరఫరా అవుతోంది. దీంతో ఈ నెలలో బీర్ల విక్రయాలు రికార్డు సృష్టించే అవకాశం ఉందని అంటున్నారు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. జర భద్రం సోదరా..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..