రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. సంక్రాంతికి రైతుభరోసా నిధులు విడుదల చేస్తామని ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. ఆ దిశగా స్పీడ్ పెంచుతోంది. దానిలో భాగంగానే.. రైతు భరోసాపై చర్చించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ మరోసారి సమావేశమైంది. సచివాలయంలో జరిగిన ఈ భేటీకి సబ్ కమిటీ సభ్యులు శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా వ్యవసాయ శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా.. రైతు భరోసా విధివిధానాలపై కేబినెట్ సబ్‌కమిటీ గంటన్నరపాటు చర్చించింది. సంక్రాంతికే రైతు భరోసా ఇవ్వాలని మంత్రి వర్గం సబ్ కమిటీ సమావేశంలో తీర్మానం చేసింది. అయితే.. రైతు భరోసా విధివిధానాలపై మరోసారి భేటీ కావాలని సబ్ కమిటీ నిర్ణయించింది..
అయితే.. సాగు భూమికే రైతు భరోసా ఇవ్వాలనే యోచనలో ఉన్న రేవంత్ సర్కార్.. ఎన్ని ఎకరాల వరకు అమలు చేయాలనే విషయంపై మాత్రం క్లారిటీకి రాలేకపోతోంది. ఈ క్రమంలోనే.. మరోసారి సమావేశమై రైతు భరోసాపై నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ సబ్‌కమిటీ డిసైడ్ అయింది. అయితే.. టాక్స్ పేయర్స్, ప్రభుత్వ ఉద్యోగులను రైతు భరోసా అనర్హులుగా ప్రకటించాలని సూచనప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది..
ఇక.. సంక్రాంతికి రైతు భరోసా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఫిక్స్ అయింది. ఈ క్రమంలోనే.. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలని, ఎవరికి ఇవ్వొద్దనే దానిపై ఫోకస్ పెట్టింది. గూగుల్ డేటా, శాటిలైట్ ఆధారంగా సాగు విస్తీర్ణం లెక్కించేందుకు పలు కంపెనీల నుంచి డేటా సేకరిస్తోంది. తాజాగా.. డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్‌కమిటీ భేటీ అయింది. అయితే.. మరోసారి సమావేశం కావాలని డిసైడ్ అయిన నేపథ్యంలో రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ ఎలాంటి రిపోర్ట్ ఇస్తుందనేది ఆసక్తి రేపుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..