TCongress: 92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల

రైతులకు పంట సాయం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని రైతు భరోసాగా మార్చినప్పటికీ పాత పద్ధతిలోనే నిధులు జమా చేస్తోంది. అయితే రైతుబంధు నిధుల విడుదల పై కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవాలను ప్రకటించింది.

TCongress: 92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
Tummala

Edited By:

Updated on: Mar 29, 2024 | 8:59 PM

రైతులకు పంట సాయం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని రైతు భరోసాగా మార్చినప్పటికీ పాత పద్ధతిలోనే నిధులు జమా చేస్తోంది. అయితే రైతుబంధు నిధుల విడుదల పై కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవాలను ప్రకటించింది. 2023-24 యాసంగి సంబంధించి ఈ రోజు వరకు 64,75,819 మంది రైతులకు రైతుబంధు నిధులు విడుదల చేసినట్టు తెలిపింది. ఇప్పటికే 92.68 శాతం మంది రైతులకు రైతుబంధు నిధులు విడుదలయ్యాయి.

రైతు బంధు నిధులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నపుడు ఏనాడు పంట పొలాలని సందర్శించని BRS నాయకులు ఇప్పుడు రైతులపై ప్రేమ కురిపిస్తూ ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం పంటల బీమా పథకం అమలు చేసినట్లైతే ఇప్పుడు ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండేవి కావన్నారు. 2020, 2021, 2023 సంవత్సరంలో అతి భారి వర్షాల వలన తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోయారని, కానీ 2023 -2024 సంవత్సరంలో వర్షపాత లోటు ఏర్పడిందని మంత్రి తుమ్మల అన్నారు.

అయితే ప్రస్తుత సాగు నీటి రిజర్వాయర్లలో, చెరువులో నీరు తగ్గుతున్నదని.. దీంతో సాగు నిరు అందక కొన్ని జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని మంత్రి అన్నారు. గత ప్రభుత్వనికి భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వం వడగండ్ల వర్షాలకు నష్టపాయిన రైతుల వివరాలను సేకరించే భాద్యత వ్యవసాయ శాఖకు వేగంగా అప్పగించాం. నష్టపోయి రైతులకు ఎకరానికి 10,000 రూపాయల నష్ట పరిహారం అందిస్తామని తుమ్మల అన్నారు.