RTC Driver Suicide: రిటైర్‌మెంట్‌కు దగ్గరపడ్డ ఆర్టీసీ డ్రైవర్‌..బస్సుకింద పడి ఆత్మహత్య! కుటుంబ సభ్యుల ఆరోపణ ఇలా..

|

May 12, 2022 | 4:21 PM

ఈ నెలాకరులో రిటైర్‌ అవాల్సి ఉంది. కానీ, అంతలోనే దారుణానికి పాల్పడ్డాడు డ్రైవర్‌ కిషన్‌. గుట్ట బస్‌ డిపోలోని బంక్ లో డీజిల్ నింపుకుని వెళుతుండగా ఒక్కసారిగా బస్సుకింద పడి..

RTC Driver Suicide: రిటైర్‌మెంట్‌కు దగ్గరపడ్డ ఆర్టీసీ డ్రైవర్‌..బస్సుకింద పడి ఆత్మహత్య! కుటుంబ సభ్యుల ఆరోపణ ఇలా..
Bosubabu
Follow us on

మరో పదిహేను రోజుల్లో పదవీ విరమణ సమయం..కానీ, అంతలోనే మనస్తాపంతో అనంత లోకాలకు వెళ్లిపోయాడు. ఇంతకాలం సేవలందించిన బస్‌ డిపోలోనే బస్సు కిందపడి ఓ డ్రైవర్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. అధికారుల వేధింపులే కారణమంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడు కిషన్‌ యాదగిరిగుట్ట బస్‌డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఎన్నో ఏళ్లుగా ఆర్టీసీ బస్సు నడుపుతూ ఎంతో మంది ప్రయాణికుల్ని తమ గమ్యస్థానాలకు చేర్చాడు. ఇప్పుడు రిటైర్‌ మెంట్‌ వయసు దగ్గర పడింది. ఈ నెలాకరులో రిటైర్‌ అవాల్సి ఉంది. కానీ, అంతలోనే దారుణానికి పాల్పడ్డాడు డ్రైవర్‌ కిషన్‌. గుట్ట బస్‌ డిపోలోని బంక్ లో డీజిల్ నింపుకుని వెళుతుండగా ఒక్కసారిగా బస్సుకింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు డ్రైవర్‌ కిషన్‌. హఠాత్తుగా కిషన్ కింద పడటంతో బస్సును ఆపడం డ్రైవర్ కు సాధ్యపడలేదు. దీంతో బస్సు కిషన్ పైనుండి వెళ్లిపోయింది. అతడు అక్కడిక్కడే మృతిచెందాడు. ఇలా ఇంతకాలం పనిచేసిన బస్ డిపోలోనే తోటి సిబ్బంది కళ్లముందే కిషన్ తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఆర్టిసి ఉన్నతాధికారుల వేధింపులే కిషన్ ఆత్మహత్యకు కారణమని కుటుంబసభ్యులు ఆరోపించారు. కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కిషన్‌ మెడికల్‌ లీవ్‌ పెట్టాడు. ఆరోగ్యం కుదుటపడలేదని తిరిగి సిక్ లీవ్ పొడిగించాలని అధికారులను కోరాడు. అందుకు అధికారులు అంగీకరించలేదని, దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన కిషన్‌ ఈ దారుణానికి ఒడిగట్టాడంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కిషన్‌ మృతితో కుటుంబ సబ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆర్టీసీ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కిషన్‌ మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad News: కొడుకు కోసం పోరాటం..రెండు నెలల పసిగుడ్డును వదిలించుకున్న తల్లి, 14ఏళ్లుగా పెంచిన అమ్మ..

Adilabad: స్కూల్ టీచర్ల గబ్బుదందా..సంఘ భవనమే అడ్డాగా గురువుల అకృత్యాలు..