Bus Accident Video: తాండూర్‌ రూట్‌లో మరో బస్సు ప్రమాదం.. షాకింగ్ వీడియో

చేవెళ్ల సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మరణించిన దుర్ఘటన మరువక ముందే అదే రూట్‌లో మరో ఆర్టీసీ బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లాలో కర్టాటకకు చెందన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది, ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా.. ప్రయాణికులు బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Bus Accident Video: తాండూర్‌ రూట్‌లో మరో బస్సు ప్రమాదం.. షాకింగ్ వీడియో
Bus Accident

Updated on: Nov 04, 2025 | 4:11 PM

తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సోమవారం ఉదయం చేవెళ్ల సమీపంలోని జరిగిన బస్సు ప్రమాదంలో సుమారు 19 మంది ప్రయాణికులు మరణించిన ఘటన మరువక ముందే అదే రూట్‌తో తాజాగా మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లాలోని కరణ్ కోట్ మండల సమీపంలో కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా.. ప్రయాణికులు మాత్రం ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డారు.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులు సమాచారం అందించారు. హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన డ్రైవర్‌ను సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం రోడ్డుకు అడ్డంగా ఉన్న బస్సు, లారీని క్రేన్ సహాయంతో రొడ్డు పక్కకు తీసి ట్రాఫిక్ క్లియర్ చేశారు.

అయితే ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి గురైన బస్సు, లారీ రెండు కర్ణాటక రాష్ట్రానికి చెందనవేనని పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే స్థానిక వాహనదారులు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను తమ ఫోన్లలో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

వీడయో చూడండి.,

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.