Telangana: ఏం స్కెచ్ రా నాయనా..! మూడు లక్షల రూపాయల చోరిలో ముగ్గురి పాత్ర..!

| Edited By: Balaraju Goud

Jun 14, 2024 | 4:00 PM

నారాయణపేట జిల్లాలో దొంగల ముఠా రెచ్చిపోయింది. ప్రధాన రహదారి పక్కనే పట్టపగలు కారు అద్దాలు పగలగొట్టి నగదును ఎత్తుకెళ్లారు. పక్కా స్కెచ్ వేసి చోరీ చేసి చిక్కకుండా చెక్కేశారు. సీసీ టీవీ ఫుటేజీ అసలు గుట్టు బయటపెట్టింది.

Telangana: ఏం స్కెచ్ రా నాయనా..! మూడు లక్షల రూపాయల చోరిలో ముగ్గురి పాత్ర..!
Cash Theft
Follow us on

నారాయణపేట జిల్లాలో దొంగల ముఠా రెచ్చిపోయింది. ప్రధాన రహదారి పక్కనే పట్టపగలు కారు అద్దాలు పగలగొట్టి నగదును ఎత్తుకెళ్లారు. పక్కా స్కెచ్ వేసి చోరీ చేసి చిక్కకుండా చెక్కేశారు. సీసీ టీవీ ఫుటేజీ అసలు గుట్టు బయటపెట్టింది.

నారాయణపేట జిల్లా కేంద్రంలోని సెంటర్ చౌక్‌లో పట్టపగలు నిలిపి ఉన్న కారులో మూడు లక్షల రూపాయల చోరీ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. కోస్గికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి నారాయణపేటలోని APTUS అనే ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో ఇంటి లోన్ తీసుకున్నాడు. లోన్ చెల్లింపులో భాగంగా రూ.3లక్షల నగదును HDFC బ్యాంక్ లో DD తీసి చెల్లించాలని భావించాడు. అయితే సదరు బ్యాంక్ లో DD తీయడం వీలు కాలేదు. దీంతో మళ్ళీ సెంటర్ చౌక్ లోని APTUS బ్యాంక్ లో మేనేజర్ తో మాట్లాడేందుకు వెళ్ళాడు. కారులోనే నగదు ఉంచి మేనేజర్‌తో చర్చించేందుకు మొదటి అంతస్తుకు వెళ్ళాడు. అనంతరం వచ్చి చూసేసరికి కారు డ్రైవర్ సీట్ అద్దం పగిలి ఉంది. అందులోని నగదు మాయమైంది. అవాక్కైన వెంకటేష్ స్థానికులను ఆరా తీశాడు. గుర్తు తెలియని వ్యక్తులు కారు చుట్టూ తిరిగిరాని చెప్పారు. దీంతో విషయం పోలీసులకు చెప్పాడు.

మొదట రెక్కీ.. అనంతరం అవలీలగా చోరీ..!

వెంకటేష్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు స్థానికులను ఆరా తీశారు. సమీపంలోని ఓ గోల్డ్ షాప్ లో సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించడంతో చోరీని ధృవీకరించారు పోలీసులు. ఇక మొత్తం ఎపిసోడ్ లో నిందితులు పక్కా స్కెచ్ ప్రకారమే చోరికి పాల్పడ్డారు. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఈ చోరి ఘటనలో భాగస్వాములు అయ్యారు. DD తీసేందుకు వెళ్ళిన HDFC బ్యాంక్ నుంచే వెంకటేష్ ను ఈ ముగ్గురు దుండగులు ఫాలో చేశారు. అదును కోసం వెంకటేష్ ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళారు. చివరకు APTUS బ్యాంక్ వద్ద కారు నిలపడంతో కాసేపు రెక్కి నిర్వహించారు. ఎవరికి అనుమానం రాకుండా ముగ్గురులోని ఒక వ్యక్తి డ్రైవర్ డోర్ అద్దం పగులగొట్టి అక్కడి నుంచి జారుకున్నాడు.

వీడియో చూడండి.. 

ఇక ఇంకో దుండగుడు పక్కనే షాప్ లో ఏదో ఖరీదు చేస్తున్నట్లు నటిస్తూ… మొదటి వ్యక్తి అద్దం పగలగొట్టగానే కారులోని నగదును దొంగిలించాడు. ఇక చివరగా ముడోవాడు పారిపోయేందుకు సిద్దంగా బైక్‌పై వెయిట్ చేస్తూ నగదుతో రెండో వాడు రాగానే అక్కడి నుంచి జంప్ అయ్యారు. ఈ తతంగం అంతా అక్కడే ఉన్న సీసీ టీవీ ఫుటేజీలో రికార్డ్ అయ్యింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం వేట మొదలు పెట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…