Telangana: ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో అనుమానాస్పదంగా బ్యాగ్.. ఓపెన్ చేయగా..

|

Apr 07, 2025 | 3:28 PM

మత్తును చిత్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కేటుగాళ్లు తమ దందాను యదేచ్చగా కొనసాగిస్తున్నారు. పుష్పరాజ్‌ను మించిపోయే తెలివితేటలతో డ్రగ్స్, కొకైన్, గంజాయి లాంటి మత్తు పదార్ధాలను రాష్ట్ర సరిహద్దులను దాటిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటన ఒకటి తెలంగాణలో చోటు చేసుకుంది.

Telangana: ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో అనుమానాస్పదంగా బ్యాగ్.. ఓపెన్ చేయగా..
Bag(representative Image)
Follow us on

ఆశ మనిషిని బ్రతికిస్తే.. అత్యాశ మాత్రం మనిషిని నిద్ర లేకుండా చేస్తుంది. ఎన్నో సమస్యలకు దారి తీస్తుంది. సరిగ్గా ఇలాంటి తరహ ఘటన ఒకటి తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా ట్రావెల్స్ బస్సులో అక్రమంగా తరలిస్తున్న కొకైన్‌ను పట్టుకున్నారు పోలీసులు.

జహీరాబాద్ మండలం చిరాగ్‌పల్లి అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై టాస్క్ ఫోర్స్ బృందం వాహనాల తనిఖీలు చేపట్టింది. ఆ రూట్‌లో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. గోవా నుంచి హైదరాబాద్ వస్తోంది. ఆ బస్సును ఆపి చెక్ చేయగా.. డ్రైవర్ సీట్ పక్కన ఓ సంచి కనిపించింది. అందులో రూ. 10 లక్షల విలువైన 10.30 గ్రాముల కొకైన్ లభించింది. డ్రైవర్ ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలానికి చెందిన డి.చంద్ర శేఖర్(34)గా గుర్తించారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వీడియో ఇక్కడ చూడండి..

 

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి