Telangana: సింగరేణి కార్మికులకు దసరా బోనస్‌.. కాంట్రాక్ట్‌ కార్మికులకు కూడా

|

Sep 20, 2024 | 7:11 PM

సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బోనస్ ప్రకటించింది. కాంట్రక్ట్ కార్మికులకు కూడా బోనస్ ప్రకటిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Telangana: సింగరేణి కార్మికులకు దసరా బోనస్‌.. కాంట్రాక్ట్‌ కార్మికులకు కూడా
Singareni Workers
Follow us on

సింగరేణి సంస్థ ఉద్యోగులకు బంపర్‌ బొనాంజా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. దసరా సందర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ బోనస్‌ ప్రకటించింది. 2023-24 ఏడాదిలో సింగరేణికి 4,701 కోట్లు లాభం వచ్చింది. ఇందులో సింగరేణి కార్మికులకు 796 కోట్ల రూపాయలు బోనస్‌గా ప్రకటిస్తున్నట్టు చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సగటున ఒక్కో కార్మికుడికి 1.90లక్షలు బోనస్‌.. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు 5వేల రూపాయల చొప్పున ఇస్తున్నట్లు చెప్పారు భట్టి. సింగరేణి చరిత్రలో తొలిసారిగా కాంట్రాక్ట్‌ ఉద్యోగులకూ బోనస్‌ ఇస్తున్నామన్నారు. సింగరేణి కార్మికులకు సంతోషంగా బోనస్‌ ప్రకటిస్తున్నట్టు చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి . గతంలో కంటే ఎక్కువగా ఈసారి దసరా బోనస్ అందిస్తున్నామన్నారు.

సింగరేణి లాభాల్లో 33 శాతం బోనస్‌గా ప్రకటించడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలంగాణలో దశాబ్దాల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ.. దేశంలోనే అత్యంత ధనిక బొగ్గు గని సంస్థగా కొనసాగుతోంది. యేటా సింగరేణి సంస్థ లాభాలు గణనీయంగా పెరుగుతున్నాయి. సింగరేణిలో పనిచేస్తున్న 41వేల 837 మంది కార్మికులు, ఉద్యోగులకు వచ్చిన లాభాల్లో ప్రతియేటా పంచుతుంది ప్రభుత్వం. లాబాల్లో నుంచి ప్రతిఏడాది దసరా బోనస్‌ ఇస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..