ఏదైనా వాహనం కొనేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారా? బిగ్ షాక్ ఇవ్వబోతున్న సర్కార్

కొత్త బైక్‌ కొనాలనుకుంటున్నారా? లేక కొత్త కారు.. ఏదైనా వాహనం కొనేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారా? అయితే, మీపై అదనపు భారం పడబోతోంది. ఇకపై రోడ్‌సేఫ్టీ సెస్ వసూలుకు నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణకు దీన్ని అమలు చేయబోతోంది

ఏదైనా వాహనం కొనేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారా? బిగ్ షాక్ ఇవ్వబోతున్న సర్కార్
Road Safety Cess

Updated on: Jan 03, 2026 | 10:42 AM

కొత్త బైక్‌ కొనాలనుకుంటున్నారా? లేక కొత్త కారు.. ఏదైనా వాహనం కొనేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారా? అయితే, మీపై అదనపు భారం పడబోతోంది. ఇకపై రోడ్‌సేఫ్టీ సెస్ వసూలుకు నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణకు దీన్ని అమలు చేయబోతోంది

కొత్త బైక్‌ కొంటే 2వేలు.. కారు కొంటే 5వేల రూపాయలు.. భారీ వాహనాలు అయితే 10వేల రూపాయలు సెస్ కింద చెల్లించాల్సి ఉంటుంది. రహదారి భద్రతా సెస్ కింద దీన్ని వసూలు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే, తేలికపాటి రవాణా వాహనాల త్రైమాసిక పన్నును లైఫ్‌ట్యాక్స్‌గా మార్పు చేశారు. దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆటోలు, ట్రాక్టర్‌ ట్రాలీలకు రోడ్‌సేఫ్టీ సెస్ నుంచి మినహాయింపు కల్పించారు.

రోడ్‌ సేఫ్టీ సెస్ కింద ప్రభుత్వానికి ఏటా 3వందల కోట్ల రూపాయల అదనపు ఆదాయం రానుంది. ఇటీవలే వాహనాలపై లైఫ్‌ ట్యాక్స్‌ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కొత్తగా రోడ్‌సేఫ్టీ సెస్సు విధించింది. కొత్త వాహనాలు కొనుగోలుచేసేవారికి ఈ రెండు భారంగా మారనున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..