
ట్రావెల్స్ బస్సు, లారీ ఢీకొన్ని ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో వెలుగు చూసింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చుస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం నేషనల్ హైవే 44పై ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరు వెళ్తున్న BCVR ట్రావెల్స్ బస్సు మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం కాటవరం స్టేజ్ వద్ద అదుపుతప్పి ముందువెళ్తున్న కంటైనర్ లారీని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానిక వాహనదారులు వెంటనేచ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
స్థానికుల సమాచారంతో హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద స్థితిని పరిశీలించిన మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన వారితో పాటు, మృతదేహాలను కూడా హాస్పిటల్‌కు తరలించారు. పోస్ట్‌మార్టం తర్వాత మృతదేహాలను బాధితకుటుంబాలకు పోలీసులు అందజేయనున్నారు. ఇక ప్రమాదం కారణంగా రోడ్డుకు అడ్డంగా పడిపోయిన వాహనాలను క్రేయిన్ సహాయంతో తొలగించిన పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.