Hyderabad: RGIA పోలీసుల అదుపులో ప్రముఖ యూట్యూబర్ నందన

ప్రముఖ యూట్యూబర్ నందనను అదుపులోకి తీసుకున్న ఆర్‌జీఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై లుక్ ఔట్ నోటీసులు ఉండటంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అనంతరం నందనను ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పజెప్పనున్నారు అధికారులు. లండన్‌లో ఉద్యోగాల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలో నందన దంపతులపై గతంలో లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు.

Hyderabad: RGIA పోలీసుల అదుపులో ప్రముఖ యూట్యూబర్ నందన
Youtuber Nandana

Edited By:

Updated on: Sep 07, 2026 | 6:18 PM

ప్రముఖ యూట్యూబర్ నందనను అదుపులోకి తీసుకున్న ఆర్‌జీఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై లుక్ ఔట్ నోటీసులు ఉండటంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అనంతరం నందనను ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పజెప్పనున్నారు అధికారులు. లండన్‌లో ఉద్యోగాల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలో నందన దంపతులపై గతంలో లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు.

యూకే వీసా స్కాం సహా ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన యూట్యూబర్‌ నందనపై లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ కావడంతో ఆమెను పోలీసులు గుర్తించారు. తర్వాత కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం అందించారు. లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నందన దంపతులు డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. బాధితులు పోలీసులను ఆశ్రయించగా.. ఇప్పటికే వారి మీద కేసు నమోదు అయింది. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. వారిపై కేసులను నమోదు చేయడంతో పాటు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో రమానందన అమెరికా నుంచి ఎమిరేట్స్‌ ఈకె – 526 విమానంలో హైదరాబాద్‌కు రాగా.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

వర్క్ పర్మిట్ చేసే స్పాన్సర్షిప్ సర్టిఫికెట్ వీసా కోసం నందన ఫ్యామిలీకి డబ్బులిచ్చినట్లు బాధితుల ఆరోపణ. ఒక్కొక్కరి నుంచి 20 లక్షల వరకు వసూలు చేసినట్లు.. 50మందికిపైగా బాధితులు ఉన్నారు. వర్క్ పర్మిట్ వీసాలు ఇచ్చే ఐదారు కంపెనీల్లో తన భర్త కన్సల్టెంట్‌ అని చెప్పి నందనే వసూళ్లు చేశారట. అయితే తన కుటుంబంపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని అప్పట్లో ఓ వీడియో పోస్ట్ చేశారు నందన. కానీ అందులో వీసా స్కామ్ విషయం గురించి మాత్రం ప్రస్తావించలేదు.

ఏపీ, తెలంగాణతో పాటు గుజరాత్, రాజస్థాన్, బిహార్‌కు చెందిన బాధితులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. నందన ఫ్యామిలీ వారి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆరోపణల్లో నిజమెంత..? ఎంత మొత్తం వెనకేశారు..? పోలీసుల విచారణలో ఎలాంటి అంశాలు తెరపైకి వస్తాయన్న ఉత్కంఠ నెలకొంది.

Loading...
Unable to load recommendations.
Follow Us