CM Revanth Reddy: ముఖ్యమంత్రిగా రేవంత్ మొదటి బహిరంగ సభ అక్కడే.. ఏర్పాట్లు చేయాలని నేతలకు ఆదేశం..

MCRHRD లో ఐదు జిల్లాల ఇంచార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. జిల్లాల వారీగా ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్ నేతలతో సమావేశమయ్యారు సీఎం రేవంత్. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేయాలన్న సీఎం ఈ నెల 26 తరువాత జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో తొలి సభ నిర్వహించనున్నారు.

CM Revanth Reddy: ముఖ్యమంత్రిగా రేవంత్ మొదటి బహిరంగ సభ అక్కడే.. ఏర్పాట్లు చేయాలని నేతలకు ఆదేశం..
CM Revanth Reddy

Edited By:

Updated on: Jan 09, 2024 | 6:39 AM

MCRHRD లో ఐదు జిల్లాల ఇంచార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. జిల్లాల వారీగా ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్ నేతలతో సమావేశమయ్యారు సీఎం రేవంత్. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేయాలన్న సీఎం ఈ నెల 26 తరువాత జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో తొలి సభ నిర్వహించనున్నారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే ఇంద్రవెల్లిలో భారీ సభ నిర్వహించిన రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక కూడా తొలి సభ అక్కడే నిర్వహించనున్నారు. ఇంద్రవెల్లి అమరుల స్మారక స్మృతి వనం కోసం శంఖుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదిలాబాద్ నేతలకు సూచించారు.

ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలను గుర్తించి ఆదుకుంటామన్నారు ముఖ్యమంత్రి రేవంత్. సంక్షేమం, అభివృద్ధిలో అందరూ భాగస్వాములేనని తెలిపారు. జనవరి 26 తరువాత ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. వారానికి మూడు రోజులు సాయంత్రం 4 నుంచి 6 వరకు సచివాలయంలో ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. పార్లమెంటు ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని నేతలకు సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కంటే ఎక్కువ ఓట్లు సాధించేలా కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో 12కు తగ్గకుండా ఎంపీ సీట్లు గెలిపించాలన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us