Telangana: ఇంటింటికీ వాటిని పంపిణీ చేయాలి.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ దూకుడు పెంచుతోంది. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచాక అమలు చేసే 5 ప్రధాన హామీల గ్యారంటీ పత్రాన్ని ఈ నెల 17 న తుక్కుగూడలో నిర్వహించే బహిరంగ సభలో అగ్రనేత సోనియాగాంధీ విడుజదల చేస్తారని వెల్లడించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో ఆదివారం సాయంత్రం జూమ్ ద్వారా ఆయన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

Telangana: ఇంటింటికీ వాటిని పంపిణీ చేయాలి.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Revanth Reddy

Updated on: Sep 11, 2023 | 8:26 AM

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ దూకుడు పెంచుతోంది. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచాక అమలు చేసే 5 ప్రధాన హామీల గ్యారంటీ పత్రాన్ని ఈ నెల 17 న తుక్కుగూడలో నిర్వహించే బహిరంగ సభలో అగ్రనేత సోనియాగాంధీ విడుజదల చేస్తారని వెల్లడించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో ఆదివారం సాయంత్రం జూమ్ ద్వారా ఆయన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అలాగే పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 17వ తేదిన బహిరంగ సభ పూర్తయ్యాక 18వ తేదీన ఉదయం 11 గంటలకు 119 నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు చేరుకుంటారని చెప్పారు.

ఇక స్థానిక నేతలు వారితో కలిసి 5 హామీల గ్యారంటీ కార్డులను ఇంటింటికీ అందజేయాలని తెలిపారు. ఆ తర్వాత అన్ని నియోజకవర్గాల్లో కూడా మీడియా సమావేశాలను పెట్టి తమ హామీలను వివరించాలని సూచనలు చేశారు. అలాగే బహిరంగ సభకు జనసమీకరణ కోసం 11 నుంచి అన్ని మండలాల్లో సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచనలు చేశారు. రాష్ట్రంలోని ఉన్న మొత్తం 35 వేల పోలింగ్ కేంద్రాల పరిధి నుంచి బహిరంగ సభకు జనం తరలివచ్చేలా చూడాలని తెలిపారు. అలాగే దీనిపై పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఈ నెల 12,13,14వ తేదీల్లో అన్ని నియోజకవర్గాల్లో సమీక్ష జరుపుతారని చెప్పారు. జిల్లా పార్టీ అధ్యక్షులు వారితో సమన్వయం చేసుకోవాలని సూచనలు చేశారు. మరోవైపు మణిక్‌రావు ఠాక్రే మాట్లాడుతూ.. తిరగబడదా, తరిమికొడదాం అనే నినాదంతో బీజేపీ, బీఆర్ఎస్‌లపై విడుదల చేసే ఛార్జ్‌షీట్‌ను అన్ని గ్రామాలకు చేకూర్చాలని సూచనలు చేశారు.

ఇదిలా ఉండగా సీఎల్పీ నేత భట్టివిక్రమార్క సైతం పలు వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 17న జరగనున్న విజయభేరీ సభకు అగ్రనేతలందరూ తరలివస్తున్నారని చెప్పారు. అందుకోసం అందరం కలిసి ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోని.. ప్రతి గ్రామం నుంచి ప్రజలను తరలించాలని సూచనలు చేశారు. అలాగే మధుయాస్కీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని సోనియాగాంధీకి పౌర సన్మానంలా విజయభేరీ సభను జరిపించాలని సూచనలు చేశారు. ఈ సభ రాష్ట్ర ప్రజల కోసమేనని వ్యాఖ్యానించారు. మరోవైపు రేవంత్ రెడ్డి రాష్ట్ర సర్కార్‌పై విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్‌లు ఎమ్మెల్యేలుగా ప్రాతనిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలకు మాత్రమే అభివృద్ధిని పరిమితం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఇప్పటికీ ఐదు సంవత్సరాలు గడిచినా కూడా కొండగల్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యో చేసిందేమి లేదని విమర్శలు చేశారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు కొడంగల్ నియోజకవర్గం బొమ్రాస్‌పేట, దౌల్తాబాద్ మండలాలకు చెందిన పలువురు బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఆదివారం రోజున రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి స్పందించారు. నారయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాలను పడావు పెట్టారని ఆరోపించారు. అలాగే బొమ్రాస్ పేట, దౌల్తాబాద్‌లలో ఇంకా జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయలేదని అన్నారు. అలాగే కొడంగల్ రెవెన్యూ డివిడన్ ఆకాంక్షలు నేరవేరలేదని అన్నారు. నియోజకవర్గాన్ని ముక్కలు చేసేసి రెండు జిల్లాల్లో కలిపారని ఆరోపించారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యాహాలు రచిస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 119 నియోజకవర్గాలకు 115 నియోజవర్గాల అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి.