Telangana: 20ఏళ్ల తర్వాత గ్రామంలోకి అడుగుపెట్టిన ఆర్మీ జవాన్.. ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు

|

Jan 03, 2023 | 10:01 AM

నల్గొండ జిల్లాలో రిటైర్డ్‌ ఆర్మీ జవాన్‌కు ఊహించని స్వాగతం లభించింది. 20ఏళ్ల తర్వాత గ్రామంలోకి అడుగుపెట్టిన సైనికుడికి భాజాభజంత్రీలు, డప్పు వాయిద్యాలు, బతుకమ్మ ఆటపాటలతో ఘనస్వాగతం పలికారు గ్రామస్తులు.. 

Telangana: 20ఏళ్ల తర్వాత గ్రామంలోకి అడుగుపెట్టిన ఆర్మీ జవాన్..  ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు
Army Jawan
Follow us on

జై జవాన్, జై కిసాన్ అంటూ అన్నం పెట్టే రైతుని, దేశానికి రక్షణగా నిలిచిన జవాన్ ను గౌరవిస్తున్నారు. కుటుంబాన్ని విడిచి.. దేశ రక్షణ కోసం చలి, వాన, ఎండ.. ఇవేమీ లెక్కచేయకుండా ఎలాంటి ప్రతికూల వాతావరణంలోనైనా దేశం కోసం పనిచేసే త్యాగశీలులు జవాన్లు. కుటుంబానికి దూరంగా ఉంటూ ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజల కోసం పనిచేసే సైనికులంటే ఎవరికైనా అంతులేని గౌరవమే. అలాంటి ఓ సైనికుడికి ..

నల్గొండ జిల్లా బట్టుగూడెం గ్రామస్తులు ఊహించని విధంగా స్వాగతం పలికారు. 20ఏళ్లపాటు దేశ రక్షణ కోసం పనిచేసి, ఉద్యోగ విరమణ తర్వాత గ్రామంలో అడుగుపెట్టిన ఆర్మీ జవాన్‌ లక్క లింగారెడ్డికి గ్రాండ్‌ వెల్‌కమ్‌ పలికారు. భాజా భజంత్రీలు, డప్పు వాయిద్యాలు, బతుకమ్మ ఆటపాటలతో ఘనస్వాగతం పలికారు. ఆర్మీలో చేరడం ఈజీయే కావొచ్చు, కానీ 20ఏళ్లపాటు సొంతూరుకి, కుటుంబానికి దూరంగా ఉంటూ పనిచేయడం కత్తి మీద సవాలే అంటున్నారు జవాన్‌ లింగారెడ్డి. ఎన్నో కష్టనష్టాలు, ఒడిదుడుకులు ఉంటాయన్నారు. అయితే, దేశానికి సేవ చేసే అవకాశం రావడం అదృష్టం అన్నారు.

20ఏళ్ల తర్వాత గ్రామంలోకి అడుగుపెట్టిన లింగారెడ్డికి చిన్నాపెద్దా అందరూ ఘనస్వాగతం పలికారు. దేశ భక్తి గీతాలకు డ్యాన్స్‌లు చేస్తూ
జాతర మాదరిగా గ్రాండ్‌ వెల్‌కమ్‌ పలికారు. కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్తులు, స్నేహితులు, ప్రజాప్రతి నిధులు తరలివచ్చి స్వాగతం పలకడంతో సంతోషంలో ఉక్కిరిబిక్కిరయ్యారు లింగారెడ్డి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..