ఆర్ఆర్ఆర్ ఒక సూపర్ గేమ్ ఛేంజర్.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

నల్గొండ బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ.700 కోట్ల రూపాయలు మంజూరీ చేసిన కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరికి కృతజ్జతలు తెలియజేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. బైపాస్ నిర్మాణం వల్ల నల్గొండ పట్టణం అద్భుతంగా అభివృద్ధిని సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నల్గొండ ప్రజలకు ప్రమాదాలు, ట్రాఫిక్ వంటి ఇబ్బందులు తొలిగిపోతాయని మంత్రి తెలియజేశారు. ఆనాడు వై.యస్. రాజశేఖర్ రెడ్డి

ఆర్ఆర్ఆర్ ఒక సూపర్ గేమ్ ఛేంజర్.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Komatireddy Venkatreddy

Edited By:

Updated on: Feb 22, 2024 | 8:22 PM

నల్గొండ బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ.700 కోట్ల రూపాయలు మంజూరీ చేసిన కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరికి కృతజ్జతలు తెలియజేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. బైపాస్ నిర్మాణం వల్ల నల్గొండ పట్టణం అద్భుతంగా అభివృద్ధిని సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నల్గొండ ప్రజలకు ప్రమాదాలు, ట్రాఫిక్ వంటి ఇబ్బందులు తొలిగిపోతాయని మంత్రి తెలియజేశారు. ఆనాడు వై.యస్. రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ కు గేమ్ ఛేంజర్ గా ఔటర్ రింగ్ రోడ్డును తీసుకువచ్చారని.. దాంతో హైదారాబాద్ లో ఎయిర్ పోర్ట్, సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీలు అభివృద్ధి చెందాయని.. తాము రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించి హైదరాబాద్ కు సూపర్ గేమ్ ఛేంజర్ గా మారుస్తున్నామని వివరించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన జాతీయ రహదారుల గురించి ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి విన్నవించడం జరిగిందని ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలియజేశారు. అడిగిన 16 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలనే వినతిపై నితిన్ గడ్కరి సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రగతిని మార్చే ఈ 16 జాతీయ రహదారుల గురించి దాదాపు గంటన్నరపాటు చర్చించి రాష్ట్ర అవసరాలను వివరించామని తెలిపారు. అందుకు వారు స్పందించి తక్షణం అనుమతులు మంజూరీ చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఇవే కాకుండా సిఆర్ఐఎఫ్ కింద మరో రూ.855 కోట్ల రూపాయలను మంజూరీ అయ్యేలా ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.

దేశంలో లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పటికి కేసీఆర్ ప్రభుత్వం కేంద్రంతో పేచీలు పెట్టుకొని జాతీయ రహదారులు రాకుండా చేసిందని.. కానీ నితిన్ గడ్కరీతో మాట్లాడినప్పుడు వారు చాలా సానుకూలంగా స్పందించారని మంత్రి తెలిపారు. తాను ప్రతిపక్ష ఎంపీగా ఉన్నప్పటికి ఆనాడు గడ్కరీ.. ఎల్బీనగర్-మల్కాపూర్ రహదారికి ఆరు వందల కోట్లు, గౌరెల్లి భద్రచాలానికి మూడు వందల కోట్లు మంజూరీ చేశారని.. ప్రజల అవసరాల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రతిపక్షం, అధికారపక్షం అనేతేడా లేకుండా ఫలితం వస్తుందని ఆయన చెప్పారు. ఇప్పుడు ఆ పనులు నడుస్తున్నాయని వివరించారు. ఈ 16 రహదారులను వెంటనే మంజూరీ చేస్తామని తెలిపినట్లు మంత్రి వివరించారు.