Telangana: యువకులు రీల్స్ చేస్తుంటే చూసిన మరో యువకుడు.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే షాకే.. రంగంలోకి పోలీసులు..

అది వనపర్తిలోని రద్దీగా ఉండే బస్టాండ్ ప్రాంతం.. అంతా తమ పనుల్లో తామున్నారు. ఇంతలో ఒక్కసారిగా కేకలు, అరుపులు.. పదుల సంఖ్యలో యువకులు వీధుల్లోకి చేరి ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. చూస్తుంటే ఏదో గ్యాంగ్ వార్ జరుగుతోందా అన్నట్లుగా సీన్ మారిపోయింది. అసలు ఈ గొడవకు కారణం ఏంటో తెలసా..?

Telangana: యువకులు రీల్స్ చేస్తుంటే చూసిన మరో యువకుడు.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే షాకే.. రంగంలోకి పోలీసులు..
Wanaparthy Youths Clash

Edited By:

Updated on: Jan 12, 2026 | 9:57 PM

రీల్స్ మోజుతో యువత రెచ్చిపోతోంది. ఎక్కడ ఉన్నామన్నది మరచిపోయి వీరంగం సృష్టిస్తున్నారు. చిన్న అంశాన్ని పెద్దదిగా చేసి.. నానా హంగామా చేస్తున్నారు. నడి రోడ్డుపై ఇష్టం వచ్చినట్లు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. వనపర్తిలో జరిగిన ఓ సంఘటన స్థానికులను తీవ్రంగా భయాందోళనకు గురి చేసింది. పలువురు యువకులు నడి రోడ్డుపై పిడిగుద్దులతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ నానా హంగామా చేశారు. స్థానిక బస్టాండ్ సమీపంలో రెండు వర్గాలకు చెందిన పదుల సంఖ్యలో యువకులు పెద్ద రణరంగమే సృష్టించారు. ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళన గురి చేసింది.

వనపర్తిలోని బస్‌స్టాండ్ వద్ద కొందరు యువకులు రోడ్డుపై రీల్స్ చేస్తున్నారు. అయితే అటుగా వెళ్తున్న ఓ యువకుడు రీల్స్ చేస్తుంటే చూసుకుంటూ వెళ్లాడు. అంతే సదరు యువకులు ఆ యువకుడిని అడ్డుకున్నారు. బైక్‌ను ఆపి యువకుడితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి దూషణల వరకు వెళ్ళింది. అంతటితో ఆగకుండా ఒకరిని ఒకరు తోసుకున్నారు. ఇష్యూ చిలికి చిలికి గాలి వానల ముదిరింది. ఇరు వర్గాలు తమ మిత్రులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఇరువర్గాల తరపున పదుల సంఖ్యలో యువకులు గుమిగూడారు. ఒకరినొకరు నడి రోడ్డుపై కొట్టుకున్నారు. రోడ్డుపై పరుగెత్తుతూ.. దూషణలు, పిడిగుద్దులతో రెచ్చిపోయారు. సీన్ చూస్తే ఓ గ్యాంగ్ వార్‌ను తలపించింది. కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించగా, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువురిని చెదరగొట్టారు. రీల్స్ పేరుతో యువత రోడ్లపై చేస్తున్న అల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.

వీడియో చూడండి