కాళేశ్వరం వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి ప్రవాహం.. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే..

|

Jul 28, 2024 | 9:52 AM

అయినప్పటికి వర్షాలు పడుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ, మేడిగడ్డ బ్యారేజ్ కి 4,29,020 క్యూసెక్కుల వరద ప్రవాహం రాగా అంతే స్థాయిలో 85 గేట్ల ద్వారా దిగివకు వదులుతున్నారు అధికారులు.

కాళేశ్వరం వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి ప్రవాహం.. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే..
Kaleshwaram Project
Follow us on

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ప్రాణహిత, గోదావరి ఉభయ నదులు తగ్గుముఖం పట్టాయి. నిన్నటి వరకు ఉగ్రరూపం దాల్చిన గోదావరి, ప్రాణహిత నదులు కొంత శాంతించాయని, పుష్కర ఘాట్లను తాకుతూ ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆదివారం 8.960 మీటర్ల మేర పుష్కర ఘాట్లను తాకుతూ వరద ప్రవాహం కొనసాగుతుంది.

అయినప్పటికి వర్షాలు పడుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ, మేడిగడ్డ బ్యారేజ్ కి 4,29,020 క్యూసెక్కుల వరద ప్రవాహం రాగా అంతే స్థాయిలో 85 గేట్ల ద్వారా దిగివకు వదులుతున్నారు అధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..