Hyderabad Rains: సమ్మర్‌లోనే కాదు వర్షాకాలం సీజన్‌లోనూ రికార్డులు బద్దలవుతున్నాయి. కుండపోత వర్షాలతో తన రికార్డులను తనే బ్రేక్ చేస్తున్నాడు వరుణుడు. కురవాల్సిన వాన కంటే వందా రెండొందల శాతం అధికంగా కురుస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. జూన్, జులై నెలల్లో తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు వర్షపాతం నమోదైంది. లాస్ట్ 30 డేస్ వర్షపాతం చూసుకున్నా రికార్డులు బ్రేక్ అయ్యాయి. జులై నెలలో ఇంతటి వర్షపాతాన్ని గతంలో చూడలేదంటున్నారు వాతావరణశాఖ అధికారులు. జూన్ ఒకటి నుంచి ఇప్పటివరకు స్టేట్‌వైడ్‌గా 66.4 సెంటీమీటర్ల రెయిన్‌ఫాల్ రికార్డైంది. ఇది సాధారణ వర్షపాతం కంటే 107శాతం అధికమని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోనూ కొత్త రికార్డులు నమోదయ్యాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ సాధారణం కంటే 100శాతం అధికంగా వర్షం దంచికొట్టింది. ఒక్క వారం రోజుల్లోనే సరికొత్త రికార్డు నమోదైంది. జులై 21 నుంచి 27వరకు హైదరాబాద్‌లో 137శాతం అదనపు వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. అధికంగా మేడ్చల్ జిల్లాలో 253శాతం, రంగారెడ్డి జిల్లాలో 191శాతం అదనపు వర్షం కురవడంతో కొత్త రికార్డులు క్రియేట్ అయ్యాయి. ఓవరాల్‌గా GHMC పరిధిలో ఇప్పటివరకు 49.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇది సాధారణం కంటే 70.9శాతం అదనం అని వాతావరణశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..