Rare Fish: చిలక ముక్కుతో చేప.. వింత చేపను ఎప్పుడైనా చూశారా.. లేదంటే ఈ వీడియోపై ఓ లుక్ వేయండి..

ఈ చేప అచ్చం చిలుక ముక్కు మాదిరిగా ముక్కు కలిగి ఉండి చూపరులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వలలో పడిన ఈ వింత చేపను చూసేందుకు గ్రామస్తులు ఎగబడుతున్నారు. అసలు ఇప్పటి వరకూ ఇలాంటి ఓ చేప ఉంటుందని తాము ఊహించలేదని..

Rare Fish: చిలక ముక్కుతో చేప.. వింత చేపను ఎప్పుడైనా చూశారా.. లేదంటే ఈ వీడియోపై ఓ లుక్ వేయండి..
Rare Fish Found In Warangal

Updated on: Nov 05, 2022 | 4:14 PM

ప్రకృతి ఎన్నో వింతలు విశేషాలకు నెలవు. ప్రపంచంలో నేటికీ మనిషికి తెలియని వింతలు దాగున్నాయి. అసలు ప్రకృతిలో ప్రతి జీవి ఓ అద్భుతమే. భారీ జీవులు, అందంగా అలరించే జీవులు, రంగులు మార్చే జీవులు ఇలా రకరకాలు దర్శనమిస్తాయి. ముఖ్యంగా సముద్రం రకరకాల జాతుల చేపలు, విచిత్ర జీవులకు నిలయం. సముద్ర గర్భంలో రత్నాల సహా అనేక జీవ రాశులు జీవిస్తూ ఉంటాయి. గత కొంత కాలంగా ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జీవి కనిపించినా వెంటనే దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో దర్శనమిస్తుంది. గత కొంతకాలంగా నదుల్లో విచిత్రమైన జీవులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా కనీవినీ ఎరుగని చిలుక ముక్కు చేప ఒకటి జాలర్ల వలకు చిక్కింది. ఈ వింత ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

 

 

ఇవి కూడా చదవండి

స్థానిక మత్స్యకారుల వలకు ఓ వింత చేప చిక్కింది. దీని  తల అచ్చం పక్షి తలను పోలి ఉంది. జిల్లాలోని కురవి మండలం బలపాల గ్రామ శివారులోని చెరువులో ఈ వింత చేప దొరికింది. ఈ చేప అచ్చం చిలుక ముక్కు మాదిరిగా ముక్కు కలిగి ఉండి చూపరులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వలలో పడిన ఈ వింత చేపను చూసేందుకు గ్రామస్తులు ఎగబడుతున్నారు. అసలు ఇప్పటి వరకూ ఇలాంటి ఓ చేప ఉంటుందని తాము ఊహించలేదని.. ఇలాంటి చేపను చూడటం ఇదే మొదటిసారని మత్స్యకారులు చెప్పారు. పిట్టల వెంకన్న, ఉపేందర్‌, చెన్నబోయిన వీరన్న నదిలో వేటకు వెళ్ళినప్పుడు ఈ చేప చిక్కిందని పేర్కొన్నారు.

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us