Rare Flower: నారాయణపేటలో అరుదైన బ్రహ్మకమలం పుష్పం వికసించింది. శాతావాహన కాలనీకి చెందిన వెంకటేశ్వరమ్మ ఇంట్లో రాత్రి 9 గంటల సమయంలో బ్రహ్మకమలం పుష్పం వికసించింది. ఆ ప్రాంతమంతా సువాసన వెదజల్లింది. రెండేళ్ల కిందట బ్రహ్మకమలం మొక్క నాటారు వెంకటేశ్వరమ్మ. ఆ పువ్వు ఎప్పుడు వికసిస్తుందా..అని ఎదురుచూశారు. చివరకు పవిత్రమైన బ్రహ్మకమలం వికసించడంతో.. కాలనీవాసులంతా వెంకటేశ్వరమ్మ ఇంటికి చేరుకొని పూజలు చేశారు. వికసించిన బ్రహ్మకమలం పుష్పంపై సృష్టికర్త బ్రహ్మదేవుడు ఆసీనుడై ఉంటారని నమ్ముతారు. మాములుగా అయితే హిమాలయాల్లో ఈ పుష్పాల చెట్లు కనిపిస్తాయి. హైందవ సాంప్రదాయంలో బ్రహ్మకమలం పుష్పానికి చాలా విశిష్ఠత ఉందని పండితులు చెబుతారు. బ్రహ్మ కూర్చునే పువ్వు అని చెబుతుంటారు. సంవత్సరంలో ఒకసారి మాత్రమే పూసి.. కొన్ని గంటలు మాత్రమే ఈ పుష్పాలు వికసించి ఉంటాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..