తెలంగాణలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాగా, గురువారం హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. పలు చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఇవాళ తెల్లవారుజామునుంచి పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడంతో కొద్ది రోజులుగా తిరుమలలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.