
తెలంగాణకు వాతావరణశాఖ వర్షసూచన జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరబిక్ మహాసముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ దీవులు, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, అలాగే నైరుతి, పశ్చిమ-మధ్య, తూర్పు-మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలలోకి జూన్ 4 లోగా నైరుతి రుతుపవనాలు ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. నిన్న ఆగ్నేయ మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల చక్రవాక ఆవర్తనం.జ. ఈరోజు తూర్పు మధ్యప్రదేశ్ దాన్ని సమీపంలోని చత్తీస్‌గఢ్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఇది సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది.
నిన్న ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుండి దక్షిణ కేరళ వరకు కొనసాగిన ఉపరితల ద్రోణి.. ఈరోజు తూర్పు మధ్యప్రదేశ్ దాని సమీపంలోని చత్తీస్‌గఢ్ ప్రాంతంలోని ఉపరితల చక్రవాక ఆవర్తనం నుండి విదర్భ తెలంగాణ రాయలసీమ మీదుగా ఈశాన్య తమిళనాడు వరకు సగటు సముద్రం అట్ట నుండి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది.
ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాష్ట్రంలోని చాలా జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు రానున్న నాలుగు రోజులలో క్రమంగా రెండు నుండి నాలుగు డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికలు హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు 50 నుండి 60 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటన జారీ చేసింది.