Hyderabad: రాయదుర్గం భూ వివాదంలో ఎస్బీఐ కీలక నిర్ణయం

రాయదుర్గం భూ వివాదంలో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఎస్బీఐ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా సీఎస్‌తో జరిగిన భేటీ తర్వాత ఎస్‌బీఐ ఈ నిర్ణయానికి వచ్చింది. దీనికి ప్రత్యామ్నాయ 2.5 ఎకరాల భూమిని తీసుకునేందుకు ఎస్పీఐ అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది.

Hyderabad: రాయదుర్గం భూ వివాదంలో ఎస్బీఐ కీలక నిర్ణయం
Sbi Petition Withdrawal Raidurgam

Updated on: Jun 24, 2026 | 10:21 AM

గత కొన్ని రోజులుగా తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన రాయదుర్గం భూ వివాధం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని ఎస్‌బీఐ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై తాజాగా రాష్ట్ర సీఎస్‌లో చర్చలు జరిగిన ఎస్‌బీఐ.. ఈ సమావేశం అనంతరం యూటర్న్ తీసుకుంది. సర్కారు సూచనలకు సానుకూలంగా స్పందించిన బ్యాంకు.. దీనికి ప్రత్యామ్నాయంగా 2.5 ఎకరాల భూమిని తీసుకునేందుకు అంగీకరించింది.

ఇక తాజాగా జరిగిన ఓప్పందంతో ఎస్బీఐతో ప్రభుత్వ లావాదేవీలు యథాతథంగా కొనసాగనున్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, గ్రాంట్లుతో పాటు లీడ్ బ్యాంకు హోదా కొనసాగించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక హైకోర్టు తదుపరి విచారణ తర్వాత ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ ప్రకటన తర్వాత మరోసారి టీజీఐఐసీతో ఎస్‌బీఐ సమావేశం కానుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us