16 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి, చనిపోయాడనుకున్న రమేష్ బాబు అనే వ్యక్తి వాట్సాప్ మెసేజ్ ద్వారా తిరిగి తన కుటుంబంతో కలిశారు. జ్ఞాపకశక్తి కోల్పోయి, భిక్షాటన చేస్తూ చెన్నైలో ఉన్న ఆయనను ఓ స్వచ్ఛంద సంస్థ గుర్తించింది. మెమొరీ తిరిగి రాగానే జార్ఖండ్ వివరాలు చెప్పగా, ఆ సమాచారం వాట్సాప్ ద్వారా ఆయన గ్రామానికి చేరి అద్భుతమైన కుటుంబ కలయికకు కారణమైంది.