Telangana Elections: రాహుల్ బస్సుయాత్ర షెడ్యూల్ కుదింపు.. ఇవాళ ఆర్మూర్ సభ నుంచి నేరుగా ఢిల్లీకి.. కారణం ఇదే..

Rahul Bus Yatra: ఓవైపు హామీల వర్షం..మరోవైపు విమర్శల అస్త్రం.. గెలుపు టార్గెట్‌గా అన్ని పార్టీలు వ్యూహాలకు పదను పెడుతున్నాయి. రాహుల్‌-ప్రియాంక పర్యటనతో టీ కాంగ్రెష్‌ జోష్‌ మరో లెవల్‌కు చేరుకుంది. ఆరు మాత్రమే కాదు అంతకు మించి అంటూ సరికొత్త గ్యారెంటీలనిచ్చారు రాహుల్‌-ప్రియాంక. బస్సు యాత్రకు మంచి స్పందనే లభిస్తుండటంతో మరింత జోష్‌తో ముందకు వెళ్తోంది. కానీ నేటితో తొలి విడత బస్సు యాత్ర ముగియబోతోంది. దీంతో 18 నుంచి 3 రోజులే బస్సు యాత్ర జరుపనుంది. బస్సు యాత్ర షెడ్యూల్‌ని కుదించింది.

Telangana Elections: రాహుల్ బస్సుయాత్ర షెడ్యూల్ కుదింపు.. ఇవాళ ఆర్మూర్ సభ నుంచి నేరుగా ఢిల్లీకి.. కారణం ఇదే..
Rahul Bus Yatra

Updated on: Oct 20, 2023 | 7:57 AM

భారీ సభలతో తెలంగాణ దంగల్‌ కలర్‌ఫుల్‌గా మారుతోంది. ఓవైపు హామీల వర్షం..మరోవైపు విమర్శల అస్త్రం.. గెలుపు టార్గెట్‌గా అన్ని పార్టీలు వ్యూహాలకు పదను పెడుతున్నాయి. రాహుల్‌-ప్రియాంక పర్యటనతో టీ కాంగ్రెష్‌ జోష్‌ మరో లెవల్‌కు చేరుకుంది. ఆరు మాత్రమే కాదు అంతకు మించి అంటూ సరికొత్త గ్యారెంటీలనిచ్చారు రాహుల్‌-ప్రియాంక. బస్సు యాత్రకు మంచి స్పందనే లభిస్తుండటంతో మరింత జోష్‌తో ముందకు వెళ్తోంది. కానీ నేటితో తొలి విడత బస్సు యాత్ర ముగియబోతోంది. దీంతో 18 నుంచి 3 రోజులే బస్సు యాత్ర జరుపనుంది. బస్సు యాత్ర షెడ్యూల్‌ని కుదించింది. అంతేకాదు.. నిజామాబాద్ సభ కూడా వాయిదా పడింది.

బస్సు యాత్రను (అక్టోబర్ 18) బుధవారం .. వరంగల్ జిల్లా రామప్ప ఆలయం నుంచి శ్రీకారం చుట్టగా.. ఇందులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, సీనియర్ నేత ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. బుధ, గురువారం షెడ్యూల్ ప్రకారమే బస్సు యాత్ర జరిగింది. ఇవాళ మూడో రోజు రాహుల్ గాంధీ బస్సు యాత్ర ఉత్సహాంగా సాగుతోంది. శుక్రవారం ఆర్మూర్‌ బహిరంగ సభ నుంచి నేరుగా హైదరాబాద్  చేరుకుంటారు.  హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీలో ఎమర్జెన్సీ మీటింగ్ ఉండటంతో.. ఇవాళ నిర్వహించాలనుకున్న నిజామాబాద్ సభను వాయిదా వేస్తోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.

మధ్యాహ్నం తర్వాత నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో పర్యటించి పార్టీ క్యాడర్‌లో జోష్ నింపబోతున్నారు కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ. స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో కార్యకర్తలతో పాటు ప్రజలతో మాట్లాడతారు. రాహుల్ టూర్ సందర్భంగా కాంగ్రెస్‌లో చేరికల పర్వం కొనసాగనుంది. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారు. మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.

ఇవాళ షెడ్యూల్ ఇలా..

ఇవాళ(శుక్రవారం) ఉదయం 9 గంటలకు చొప్పదండి నియోజక వర్గంలోని గంగాధర వద్ద రాహుల్ గాంధీ సభ ఏర్పాటు చేశారు. ఈ తర్వాత చొప్పదండి సభ నుంచి నేరుగా బస్సులో ఉదయం 9.30కి కొండగట్టుకు చేరుకుని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉదయం 11కు జగిత్యాలలో కార్నర్ మీటింగ్‌లో రాహుల్ మాట్లాడనున్నారు. ఇక్కడి నుంచి నేరుగా 12 గంటలకు వేములవాడలోని మేడిపల్లిలో సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం  1 గంటకు కోరుట్లకు చేరుకుంటారు. అక్కడే 1.30కి భోజనం చేసి.. అక్కడినుంచి మధ్యాహ్నం 2.30కు ఆర్మూర్‌లో బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు.

రెండో విడత బస్సు యాత్ర దసరా పండుగ తర్వాతే ఉండనుంది. కాంగ్రెస్ బస్సు యాత్ర మొత్తం మూడు విడతలుగా నిర్వహిస్తున్నారు. ఈ యాత్రలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్ర పాల్గొనడంతో మంచి స్పందన లభిస్తోంది. రాహుల్ గాంధీ తమ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను వివరిస్తున్నారు. మూడురోజుల పర్యటన ముగించుకున్న సాయంత్రం ఆర్మూర్ నుంచి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ చేరుకుంటారు రాహుల్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి