Hyderabad: మరోసారి భాగ్యనగరంలో గుప్పుమన్న మత్తు మందు.. రూ. కోటి 25 లక్షల విలువ చేసే డ్రగ్స్ సీజ్

| Edited By: Balaraju Goud

Dec 16, 2024 | 3:06 PM

డ్రగ్స్ ప్రీ తెలంగాణే లక్ష్యమంటోంది..రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం ఓ వైపు సెలబ్రెటీలతో ప్రచారం నిర్వహిస్తూ.. మరోవైపు డ్రగ్స్‌ కేసులపై ఉక్కుపాదం మోపుతోంది. అయినా రాష్ట్రంలో ఎక్కడో చోట..డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి.

Hyderabad: మరోసారి భాగ్యనగరంలో గుప్పుమన్న మత్తు మందు.. రూ. కోటి 25 లక్షల విలువ చేసే డ్రగ్స్ సీజ్
Meerpet Drugs
Follow us on

తెలంగాణ నార్కోటిక్‌ అధికారులు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నా.. హైదరాబాద్‌లో డ్రగ్స్‌ దందా మాత్రం ఆగడంలేదు. తాజాగా మీర్‌పేట్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టుబడడం కలకలం రేపుతోంది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మీర్‌పేట్‌‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు. వారి నుంచి 53 కేజీల డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ విక్రయానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు.

రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా రక్షణ స్వాధీనం చేసుకున్నారు ఎల్బీనగర్ జోన్ ఎస్‌వోటీ పోలీసులు. మీర్‌పేట్‌ పోలీసులతో కలిసి సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. ఈ తనిఖీల్లో పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు నిందుతుల నుంచి కోటి 25 లక్షల రూపాయల విలువచేసే 53.5 కిలోల పప్పీస్ట్రా డ్రగ్ సీజ్ చేశారు రాచకొండ పోలీసులు.

రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపిన వివరాల ప్రకారం ఈజీ మనీ కోసం అలవాటు పడిన నిందితులు నార్కోటిక్ డ్రగ్స్ ను విక్రయించాలని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా రాజస్థాన్‌కు చెందిన మంగీలాల్, బిష్ణోయ్ మంకీలాల్ దాకా రామ్ ముగ్గురు నిందితులు మధ్యప్రదేశ్‌కు చెందిన పింటూ అనే వ్యక్తి నుంచి పప్పీస్ట్రా మాదకద్రవ్యాలని తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాదులో విక్రయిస్తున్నారు. పక్కా సమాచారం తెలుసుకున్న రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు

అయితే ఈ మాదకద్రవ్యాలను లారీలు, బస్సులు, ట్రైన్‌ ద్వారా నగరానికి తీసుకువచ్చి కన్జ్యూమర్లకు అమ్ముతున్నారని రాచకొండ సీపీ తెలిపారు 2023లో మంకీలాల్ బిష్ణోయ్‌ను హయత్ నగర్ పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్టు చేసినట్టు సీపీ తెలిపారు. ఇతనిపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామని సీపీ తెలిపారు. కాగా మెయిన్ పెడ్లర్ గా ఉన్న పింటూను పట్టుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అంతేకాకుండా మరో ముగ్గురు నగరంలో స్థానిక రిసీవర్సుగా ఉన్నారని, వారిని త్వరలో పట్టుకుంటామని రాచకొండ సీపీ తెలిపారు. అయితే ఈ పప్పీస్ట్రాను పాలు వాటర్, ఛాయ్‌లో కలుపుకుని తాగుతారు. మరోవైపు, ఈ కేసు ఇంకా విచారణలో ఉందని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని రాచకొండ సిపి సుధీర్ బాబు వెల్లడించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..