లిఫ్టులో ఇరుక్కున్న విద్యార్థులు.. ప్రాణాలు కాపాడిన పోలీసులకు రాచకొండ కమిషనర్ అభినందన

లిఫ్టులో ఇరుక్కున్న విద్యార్థులను పోలీసులు బయటకు తీసుకొచ్చిన ఘటన ఉప్పల్ స్కైవాక్ వద్ద మంగళవారం(ఆగస్ట్ 6) జరిగింది. ఉప్పల్ రింగ్ రోడ్డు చౌరస్తాలోని స్కైవాక్ లిఫ్టులో విద్యార్థులు ఇరుక్కుపోయారు. దాదాపు నలభై నిమిషాల పాటు డోర్లు ఓపెన్ కాక లోపలే ఇబ్బంది పడ్డారు.

లిఫ్టులో ఇరుక్కున్న విద్యార్థులు.. ప్రాణాలు కాపాడిన పోలీసులకు రాచకొండ కమిషనర్ అభినందన
Uppal Sky Walk

Edited By:

Updated on: Aug 07, 2024 | 7:06 PM

లిఫ్టులో ఇరుక్కున్న విద్యార్థులను పోలీసులు బయటకు తీసుకొచ్చిన ఘటన ఉప్పల్ స్కైవాక్ వద్ద మంగళవారం(ఆగస్ట్ 6) జరిగింది. ఉప్పల్ రింగ్ రోడ్డు చౌరస్తాలోని స్కైవాక్ లిఫ్టులో విద్యార్థులు ఇరుక్కుపోయారు. దాదాపు నలభై నిమిషాల పాటు డోర్లు ఓపెన్ కాక లోపలే ఇబ్బంది పడ్డారు. ఈ ఘటనలో జ్యోతి, వాసవి, జాన్సన్ అనే ముగ్గురు విద్యార్థులు మెట్రో స్టేషన్ వైపు వెళ్లేందుకు ఉప్పల్ రింగ్ రోడ్డులోని స్కైవాక్ లిఫ్ట్ ఎక్కారు. బయటకు వెళ్లేందుకు ఎంత సేపటికీ డోర్లు ఓపెన్ కాకపోవడంతో ఆందోళన చెంది 100కు కాల్ చేశారు. సమాచారం అందిన తక్షణమే స్పందించిన ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు వెళ్లి లిఫ్ట్ డోర్ పగలగొట్టి విద్యార్థులను బయటకు తీసుకొచ్చారు.

Rachakonda Police Commissioner

విద్యార్థుల ప్రాణాలను కాపాడిన పోలీసులను రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అభినందించారు. సకాలంలో స్పందించినందుకు వారిని సత్కరించారు. పెట్రో కార్, బ్లూ కోల్ట్స్ వంటి క్షేత్రస్థాయి విధి నిర్వహణలో మహిళా సిబ్బందికి కూడా మరింత ప్రాధాన్యత ఇస్తున్నారు సీపీ. శక్తియుక్తులను, ప్రతిభను ప్రదర్శించే అవకాశం కల్పిస్తున్నారు. తద్వారా సామాన్య ప్రజలు, మహిళలు మరింత ధైర్యంగా తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకువస్తున్నారు. ఉప్పల్ స్కైవాక్ వద్ద ఘటనలో మహిళా కానిస్టేబుళ్లు కూడా తోటి పురుష సిబ్బందితో పాటు శక్తివంచన లేకుండా శ్రమించారు. లిఫ్టులో ఇరుక్కున్న విద్యార్థులను బయటకు తీసుకురావడంలో క్రియాశీలకంగా వ్యవహారించారు. ఈ ఘటనలో సమన్వయంతో వ్యవహరించి, ఎంతో శ్రమించి విద్యార్థులను రక్షించిన కానిస్టేబుల్ ఝాన్సీ సహా ఇతర కానిస్టేబుళ్లను కమిషనర్ అభినందించి సత్కరించారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..