Python Hulchul: తెలంగాణ లో అడవులను వదిలి.. జనావాసాల బాట పట్టాయి కొండచిలువలు. వివిధ ప్రాంతాల్లో కొండచిలువలు కనిపిస్తూ.. మనుషులను భయబ్రాంతులకు గురు చేస్తున్నాయి. తాజాగా మహబూబ్ నగర్ లో అర్ధరాత్రి ఓ కొమడచిలువ హల్చల్ చేసింది. మినీ ట్యాంక్ బండ్ పైనున్న రోడ్డును దాఉతూ జనం కంట పడింది. సుమారు ఆరడుగులున్న కొండ చిలువను చూసి జనం షాక్ తిన్నారు. కొండచిలువ మినీ ట్యాంక్ బండ్ పక్కనే ఉన్న కాలనీ వైపు వెళుతుండడంతో.. భయంతో స్థానికులు దానిని రాళ్లతో కొట్టి చంపారు. తమ ప్రాంతంలో తరచూ పాములు, తేళ్లు వస్తున్నాయని.. కాలనీ వాసులు భయబ్రాంతులకు గురవుతున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇక మరోవైపు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో కూడా కొండచిలువ హల్ చల్ చేసింది. సిరసపల్లి క్రాస్ రోడ్డు ప్రధాన రహదారి పై కొండచిలువ కనిపించింది. దీంతో రహదారిపై వెళుతున్న ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇలా పాములు, కొండచిలువలు, తేళ్లు, జెర్రెలు పల్లెటూర్లలో బయటకు రావడానికి కారణం.. వేసవి ఎండల నుంచి ఉపశమనం ఇస్తూ.. వర్షాలు కురవడమేనని.. దీంతో పల్లెల్లో, అడవి సమీప ప్రాంతాల్లో సర్పాలు, కొండచిలువలు బయటకు వచ్చే సమయమని అధికారులు చెబుతున్నారు. చల్లదనం ఉన్న ఈ సమయంలో పాములు బయటకు వచ్చి సేద తీరడానికి చూస్తుంటాయి. ఇలాంటి సందర్భాల్లోనే గ్రామస్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇదే విషయంపై వైద్య నిపుణులు మాట్లాడుతూ.. రహదారులు, నివాసాల ఇటీవల కాలంలో పాముల బెడద ఎక్కువైందని చెప్పారు. అంతేకాదు పాము కాటు బారిన పడిన సందర్భాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, పాము కాటుకు గురికాకుండా ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలేమిటి అన్న అంశాలపై చాలా మందికి అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. అవగణాలేమితో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని ఎవరికైనా పాముకాటు జరిగిన గంటలోపు ప్రభుత్వ ఆస్పత్రికి వెళి తే ప్రాణాపాయం తప్పుతుంది. నాటు వైద్యం జోలికి వెళితే అపాయం కొని తెచ్చుకున్నట్లేనని నిపుణులైన వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Also Read: Banana In Ayurveda: ప్రకృతి ప్రసాదించిన ఔషధం అరటి చెట్టు.. దీని పువ్వు, కాండం, ఆకు అన్నీ ఆయుర్వేద వైద్యంలో ఉపపయోగాలే..