Telangana: కామారెడ్డిలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి పైశాచికత్వం.. ఫీజు ఇవ్వలేదని రోగికి వేసిన కుట్లు తొలగించిన సిబ్బంది!

|

Sep 23, 2024 | 8:08 PM

ప్రాణాలతో పోరాడుతూ చికిత్స కోసం వచ్చే ఆభాగ్యులను జలగల్లా పీడించే ప్రైవేట్ ఆస్పత్రలు మన చుట్టూ చాలానే ఉన్నాయి. రోగి మృతి చెందినా పూర్తి ఫీజు చెల్లిస్తే గానీ మృతదేహాలను అప్పగించని ఆస్పత్రులు కూడా ఉన్నాయి. తాజాగా ఫీజుల కోసం ఓ ప్రైవేట్ దవాఖానా సిబ్బంది ఎంతకు తెగించిందో మీరే తెలుసుకోండి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యువకుడికి కుట్లు వేసినందుకు ఫీజు చెల్లించమని..

Telangana: కామారెడ్డిలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి పైశాచికత్వం.. ఫీజు ఇవ్వలేదని రోగికి వేసిన కుట్లు తొలగించిన సిబ్బంది!
Kamareddy Private Hospital
Follow us on

కామారెడ్డి, సెప్టెంబర్‌ 23: ప్రాణాలతో పోరాడుతూ చికిత్స కోసం వచ్చే ఆభాగ్యులను జలగల్లా పీడించే ప్రైవేట్ ఆస్పత్రలు మన చుట్టూ చాలానే ఉన్నాయి. రోగి మృతి చెందినా పూర్తి ఫీజు చెల్లిస్తే గానీ మృతదేహాలను అప్పగించని ఆస్పత్రులు కూడా ఉన్నాయి. తాజాగా ఫీజుల కోసం ఓ ప్రైవేట్ దవాఖానా సిబ్బంది ఎంతకు తెగించిందో మీరే తెలుసుకోండి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యువకుడికి కుట్లు వేసినందుకు ఫీజు చెల్లించమని ఆస్పత్రి సిబ్బంది కోరారు. అయితే తన వద్ద అంత డబ్బు లేదని చెప్పినందుకు ఆగ్రహించిన ఆస్పత్రి యాజమన్యం.. యువకుడికి వేసిన కుట్లను తొలగించింది. ఈ దారుణ ఘటన కామారెడ్డి కేంద్రంలో ఆదివారం చోటుచేసుంది. వివరాల్లోకెళ్తే..

కామారెడ్డి పట్టణానికి చెందిన శ్రీను అనే యువకుడు బైక్‌ వెళ్తుండగా.. అదుపుతప్పి కిందపడి గాయాలపాలయ్యాడు. రక్తస్రావం కావడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ దవాఖానకు వెళ్లాడు. డాక్టర్‌ కన్సల్టేషన్‌ ఫీజు రూ. 300 చెల్లించి చూపించుకున్నాడు. ప్రమాదంలో తగిలిన గాయాలకు దవాఖాన సిబ్బంది కుట్లు వేసి, కట్లు కట్టారు. కుట్ల వేసినందునందుకు మళ్లీ డబ్బులు అడిగారు. తన వద్ద నగదు లేకపోవడంతో క్రెడెట్‌ కార్డు ద్వారా ఫీజు తీసుకోవాలని చెప్పాడు. అయితే అందుకు దవాఖాన సిబ్బంది నిరాకరించారు. డబ్బు చెల్లించలేదని ఆస్పత్రి సిబ్బంది యువకుడితోపాటు, అతడి వెంట ఉన్న స్నేహితులపై కూడా దాడికి పాల్పడ్డారు. ఫీజు చెల్లించలేదనీ యువకుడికి వేసిన కుట్లను తొలగించి తమ పైశాచికత్వాన్ని చాటుకున్నారు. పూర్తిగా వేసిన కుట్లు తొలగించడంతో.. బాధిత యువకుడిని అతని స్నేహితులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో యువకుడి బంధువులు దవాఖాన వద్ద ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

మరో ఘటన: నవజాత శిశువు విక్రయించేందుకు యత్నం.. 9 మంది అరెస్ట్

హైదరాబాద్‌లోని చంద్రాయణగుట్ట పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉంటున్న షేక్‌ ఇస్మాయిల్‌, సుల్తానా బేగం దంపతులకు ఇటీవల ఓ మగ శిశువు జన్మించాడు. ఈ శిశుశు వీరికి నాలుగో సంతానం. దీంతో 15 రోజుల చిన్నారిని అమ్మకానికి పెట్టారు. అందుకు మెహది అనే వ్యక్తిని సంప్రదించారు. అతడు ఫాతిమా రహ్మత్‌ అనే మరో వ్యక్తికి ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. దీంతో వారంతా కలిసి చిన్నారి విక్రయించేందుకు చంద్రాయణగుట్టలో కలుసుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు శిశువు తల్లిదండ్రులతో సహా తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.