Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు, జాగరణ దీక్ష, కరీంనగర్‌లో బండి సంజయ్ అరెస్ట్ విషయమై ప్రస్తావించారు. ఇక 317జీవోపై అంశంపై ప్రధాని… బండి సంజయ్‌తో చర్చించారు. అలాగే బండి సంజయ్‌పై జరిగిన దాడి సంబంధించిన అంశాలపై మోదీ ఆరా తీశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘తెలంగాణలో బీజేపీ బలపడుతోందని.. అందుకే తనపై దాడి చేయించారని’ మోదీ దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇబ్బందిగా మారిన 317 జీఓ పై గట్టి పోరాటం చేస్తున్నామని చెప్పారు. ఇదే స్ఫూర్తితో పోరాడాలంటూ సంజయ్‌కి మోదీ సూచించారు.
ఇక ఎంపీ కార్యాలయంలో వచ్చి అలా చేయడం దారుణమని వ్యాఖ్యానించిన నరేంద్ర మోదీ.. బండి సంజయ్ కుటుంబ సభ్యులను ధైర్యంగా ఉండమని చెప్పారు. ప్రజాస్వామ్య పద్దతిలో పోరాటం చేయండని, జాతీయ నాయకుల మద్దత్తు ఎప్పటికీ ఉంటుందని మోదీ సంజయ్‌కి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మోదీ.. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల విజయాల గురించి సంజయ్‌తో చర్చించారు.
Swara Bhasker: కరోనా బారిన పడిన హీరోయిన్.. త్వరగా చచ్చిపో అంటూ ట్రోలింగ్స్.. ఆమె రియాక్షన్ ఏంటంటే..
Lemon Water: రోజూ ఉదయాన్నే నిమ్మరసం తాగుతున్నారా ? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే.. ఎందుకో తెలుసా..