Praja Palana: తెలంగాణ వ్యాప్తంగా కోటి దాటిన దరఖాస్తులు.. ‘ప్రజాపాలన’కు విశేష స్పందన..

కాంగ్రెస్ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. గత నెల 28 నుంచి పది రోజుల పాటు సాగిన అభయహస్తంకు.. దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. తెలంగాణ వ్యాప్తంగా 12,171 గ్రామ పంచాయితీలు, 3512 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలనా అభయ హస్తం దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా.

Praja Palana: తెలంగాణ వ్యాప్తంగా కోటి దాటిన దరఖాస్తులు.. ‘ప్రజాపాలన’కు విశేష స్పందన..
Praja Palana

Updated on: Jan 06, 2024 | 9:35 PM

కాంగ్రెస్ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. గత నెల 28 నుంచి పది రోజుల పాటు సాగిన అభయహస్తంకు.. దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. తెలంగాణ వ్యాప్తంగా 12,171 గ్రామ పంచాయితీలు, 3512 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలనా అభయ హస్తం దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా.. కోటి 8 లక్షల 94 వేల దరఖాస్తులు అందాయి. గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లకు ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. రేషన్ కార్డులు, పెన్షన్ల కోసం పెద్దఎత్తునే దరఖాస్తు చేసుకున్నారు ప్రజలు. అయితే.. దరఖాస్తుల పరిశీలన ఎలా జరుగుతుంది..? అర్హుల గుర్తింపు ఎలా ఉంటుంది..?

కాంగ్రెస్ అధికారం లోకి వచ్చాక.. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తుల సంఖ్య కోటి దాటింది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన నిర్వహిస్తోంది. దీని కోసం ఒక్కో గ్యారంటీకి వేర్వేరుగా దరఖాస్తు ఇవ్వాల్సిన పని లేకుండా.. ఆరు గ్యారంటీల వివరాలతో కూడిన దరఖాస్తు నమూనాను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా.. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలతో పాటు.. రేషన్ కార్డులు, ఇతర అవసరాల కోసం కూడా వినతి పత్రాలు, ఫిర్యాదులు స్వీకరించారు.

సెప్టెంబర్‌ 28 నుంచి ఆరు గ్యారంటీల ప్రోగ్రాంలో భాగంగా.. లబ్దిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈక్రమంలోనే… ప్రజాపాలన గ్యారంటీల దరఖాస్తుకు భారీగా స్పందన వచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తులు పోటెత్తాయి. ప్రజాపాలన దరఖాస్తులతో పాటు.. చాలా మంది రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో సైతం అభయహస్తం దరఖాస్తులకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా 12,171 గ్రామ పంచాయితీలు, 3512 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలనా అభయ హస్తం దరఖాస్తులను స్వీకరించారు. కాంగ్రెస్ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా.. కోటి 8 లక్షల 94 వేల దరఖాస్తులు అందాయి. గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లకు ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. రేషన్ కార్డులు, పెన్షన్ల కోసం పెద్దఎత్తునే దరఖాస్తు చేసుకున్నారు ప్రజలు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా బీఆర్ఎస్ అడ్డుకుంటుందన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. 6 గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించకపోతే బాగుంటుందని.. బీఆర్ఎస్ , బీజేపీ కలలు కంటున్నాయని.. వారి కలలను నిజం కానివ్వబోమని… త్వరలోనే హామీలను అమల్లోకి తీసుకువస్తామన్నారు భట్టి విక్రమార్క..

రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని కష్టాలున్న, ఎన్ని రకాల అప్పులు మిగిల్చిన, ఖజానా ఖాళీ చేసినా.. దృఢ నిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.

ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని ఎన్నికల టైంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అందుకే ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఆ దిశగానే చర్యలు చేపట్టింది. ఇక.. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ముగిసిన వెంటనే డేటా ఎంట్రీ షురూ చేయాలని ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. వచ్చిన అప్లికేషన్‌లను ఆన్‌లైన్‌ చేయడానికి భారీగా డీటీపీ ఆపరేటర్లను నియమించింది ప్రభుత్వం. వీరికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చింది. ఇప్పుడు అందుబాటులో ఉన్న వారితో వేగంగా పని జరగకపోతే మరికొంతమందిని నియమించాలని కూడా భావిస్తోంది. ఈ డాటా ఎంట్రీ ప్రక్రియ మొత్తం ఈ నెల 17వ తేదీ లోగా కంప్లీట్ చేయాలని ఆదేశించారు ఉన్నతాధికారులు. మొత్తానికి డేటా ఎంట్రీ ప్రక్రియ, ఆ తర్వాత అర్హుల గుర్తింపు ఎప్పటిలోగా పూర్తవుతుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..