Ponguleti Srinivasa Reddy: బీఆర్‌ఎస్‌కు రూ.2 కోట్లు ఫండ్‌ ఇచ్చా: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

బీఆర్‌ఎస్‌ పార్టీకి 2 కోట్ల రూపాయల ఫండ్‌ ఇచ్చానని, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. Tv9 బిగ్‌న్యూస్‌ బిగ్‌ డిబెట్‌లో నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దగ్గర..

Ponguleti Srinivasa Reddy: బీఆర్‌ఎస్‌కు రూ.2 కోట్లు ఫండ్‌ ఇచ్చా: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
Ponguleti Srinivasa Reddy

Updated on: Jul 04, 2023 | 8:30 PM

బీఆర్‌ఎస్‌ పార్టీకి 2 కోట్ల రూపాయల ఫండ్‌ ఇచ్చానని, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. Tv9 బిగ్‌న్యూస్‌ బిగ్‌ డిబెట్‌లో నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దగ్గర ఉన్న డబ్బుతో పోలిస్తే నేనెంత అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే బీఆర్‌ఎస్‌ నేతలకు టీవీ9 వేదికగా చాలెంజ్‌ చేస్తున్నానని, సభ కోసం బిర్యానీ, మద్యం ఇచ్చానని నిరూపించండి అంటూ సవాల్‌ విసిరారు. డబ్బులు ఇచ్చి కాంగ్రెస్‌ పార్టీలో చేరాల్సిన పని నాకు లేదని స్పష్టం చేశారు. పదవి కావాలంటే ఎప్పుడో పార్టీని మారేవాడినని, అలా అయితే బీజేపీలో చేరి ఉండేవాడిని కదా అని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి