Telangana: పొంగులేటి, జూపల్లి చేరికపై కొనసాగుతున్న పొలిటికల్ సస్పెన్స్.. కాంగ్రెస్‌లో చేరతారా లేదా చెప్పేది అప్పుడే..

|

Jun 21, 2023 | 9:17 PM

Telangana Congress: సీనియర్ నేతలు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలో చేరుతారనే సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. రేవంత్‌ రెడ్డి ఆహ్వానంతో సస్పెన్స్‌కు తెరపడుతుందని భావించినా వాళ్లు మాత్రం మూడు, నాలుగు రోజులు వేచి ఉండాలని విజ్ఞప్తి చేశారు.

Telangana: పొంగులేటి, జూపల్లి చేరికపై కొనసాగుతున్న పొలిటికల్ సస్పెన్స్.. కాంగ్రెస్‌లో చేరతారా లేదా చెప్పేది అప్పుడే..
Jupally Krishna Rao And Ponguleti Srinivas Reddy
Follow us on

కాంగ్రెస్‌లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరిక క్లైమ్యాక్స్‌కు చేరినట్టు కనిపిస్తోంది. పార్టీలో చేరాలని ఆ ఇద్దరు నేతలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కోరారు. స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి ఆహ్వానించారు. రాజకీయ పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉందని జూపల్లిని కలిసిన తర్వాత రేవంత్‌ రెడ్డి అన్నారు.  కేసీఆర్‌ వ్యవహారశైలి నచ్చని వాళ్లందరినీ కూడా కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నట్టు రేవంత్‌ వెల్లడించారు.

మరోవైపు రేవంత్‌ రెడ్డి, టీపీసీసీ నేతల పక్కనే ఉన్న జూపల్లి మాత్రం పార్టీలో చేరిక విషయంలో స్పష్టత ఇవ్వలేదు. మిత్రులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. జూపల్లిని కలిసిన తర్వాత టీపీసీసీ నేతలంతా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి వచ్చారు. దాదాపు రెండు గంటల సేపు మంతనాలు సాగించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. కాని వారు మాట్లాడుతున్న సమయంలో పొంగులేటి మాత్రం ఇంట్లోంచి బయటకు రాలేదు.

అయితే ఆ తర్వాత మాట్లాడిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక విషయంలో రెండు రోజుల్లో నిర్ణయాన్ని చెప్తానని తెలిపారు. ఇదిలా ఉండగా జూపల్లి, పొంగులేటిని ఆహ్వానించే క్రమంలో తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని చూపేందుకు టీపీసీసీ నేతలు ప్రయత్నించారు. ఇద్దరు నేతల ఇళ్లకు రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చిన్నారెడ్డి, మల్లు రవి వంటి నాయకులందరూ కలిసికట్టుగా వెళ్లారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..