Bandi sanjay: బండి సంజయ్‌కి ఊహించని షాక్‌.. ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకున్నారు..

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు పోలీసులు ఊహించని షాక్‌ ఇచ్చారు. ఇటీవలే బండి సంజయ్‌కి భద్రతను పెంచిన విషయం తెలిసిందే. అంతలోనే

Bandi sanjay: బండి సంజయ్‌కి ఊహించని షాక్‌.. ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకున్నారు..
Bandi Sanjay

Updated on: Jun 24, 2022 | 6:41 PM

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు పోలీసులు ఊహించని షాక్‌ ఇచ్చారు. ఇటీవలే బండి సంజయ్‌కి భద్రతను పెంచిన విషయం తెలిసిందే. అంతలోనే సంజయ్‌కి ఇచ్చిన పోలీసు భద్రతను ఉపసంహరించుకున్నారు. పెంచిన అదనపు భద్రతను పోలీసులు వెనక్కి తీసుకున్నారు. అగ్నిపథ్ ఆందోళనలు, జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా హైదరాబాద్ వరకు ఇటీవల బండి సంజయ్​కు 1+4 భద్రత ఉండగా.. దానిని 1+5కి పెంచుతూ.. అదనంగా ఒక ఎస్కార్ట్‌ వాహనాన్ని, రోప్‌ పార్టీని కేటాయించారు. బండి సంజయ్‌కు ప్రమాదం పొంచి ఉందని ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు నివేదిక ఇవ్వడంతో, భద్రత పెంచుతూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆయనకు పెంచిన అదనపు భద్రతను పోలీసులు వెనక్కు తీసుకున్నారు. అందుకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి