AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కామంతో కళ్లు మూసుకుపోయిన ఎస్ఐ.. న్యాయం కోసం వస్తే.. బాధితురాలికి..!

బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న ఆ అధికారి.. వేధింపులకు దిగాడు. సాయం కోరి వస్తే, నోటికొచ్చినట్టు మాట్లాడి.. ఆమెను వేధించాడు. కంచే చేను మేసిందన్న చందంగా, కాపాడాల్సిన ఖాకీనే కాటు వెయ్యడానికి ప్రయత్నించాడు. నల్లగొండ జిల్లాలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. తన కోరిక తీర్చాలంటూ, అనైతిక సంబంధం పెట్టుకోవాలంటూ నిత్యం వేధిస్తున్నాడు.

Telangana: కామంతో కళ్లు మూసుకుపోయిన ఎస్ఐ.. న్యాయం కోసం వస్తే.. బాధితురాలికి..!
Si Praveen Kumar
M Revan Reddy
| Edited By: Balaraju Goud|

Updated on: Jun 26, 2024 | 10:31 AM

Share

బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న ఆ అధికారి.. వేధింపులకు దిగాడు. సాయం కోరి వస్తే, నోటికొచ్చినట్టు మాట్లాడి.. ఆమెను వేధించాడు. కంచే చేను మేసిందన్న చందంగా, కాపాడాల్సిన ఖాకీనే కాటు వెయ్యడానికి ప్రయత్నించాడు. నల్లగొండ జిల్లాలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. తన కోరిక తీర్చాలంటూ, అనైతిక సంబంధం పెట్టుకోవాలంటూ నిత్యం వేధిస్తున్నాడు. ఒంటరిగా స్టేషన్‌కు పిలిపించుకుని ఇబ్బందులకు గురి చేశాడు. తన జోలికి రావద్దంటూ సదురు బాధితురాలు మొర పెట్టుకున్నా ఎస్ఐ వినిపించుకోలేదు. చివరికి తనను ఇబ్బంది పెడుతున్న ఎస్‌ఐపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. జిల్లా ఎస్పీ దృష్టికి విషయాన్ని తీసుకుని వెళ్లింది.

పోలీసుల తీరులో మార్పు రావడం లేదు. భూ వివాదంలో న్యాయం చేయాలని పోలీస్టేషన్ కు వచ్చిన తనను ఎస్సై వేధించారంటూ నల్లగొండ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది ఓ బాధితురాలు. తనతో సఖ్యతగా ఉంటే కేసు పరిష్కరిస్తానని లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మహిళా ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై ఎస్పీ శరత్ చంద్ర పవర్ విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం ఈ ఘటన నల్లగొండ జిల్లాలో కలకలం రేపుతోంది..

శాలిగౌరారం మండలం వంగమర్తి కి చెందిన ఓ మహిళ భూ వివాదంలో కొద్దిరోజుల క్రితం శాలిగౌరారం పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. భూ వివాదంలో తనకు న్యాయం చేయాలంటూ ఎస్సైని వేడుకుంది. అయినా కేసు నమోదు చేయకపోవడంతో శాలిగారారం ఎస్ఐ ప్రవీణ్ కుమార్‌ను మరోసారి కలిసింది. ఈ ఏడాది ఏప్రిల్ 16న మళ్లీ ఫిర్యాదు ఇవ్వాలంటూ రెండు గంటల పాటు తనను తన క్యాబిన్ లో పర్సనల్ విషయాలు మాట్లాడాడని బాధిత మహిళా ఆరోపిస్తోంది. తనతో సఖ్యతగా ఉంటే కేసు పరిష్కరిస్తానని ఎస్ఐ అన్నట్లు బాధితురాలు చెబుతోంది. పోలీస్ స్టేషన్ లో తనతో బలవంతంగా గ్రీన్ టీ పెట్టించుకుని తాగాడని తెలిపింది. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి. చేపల కూర, చికెన్ వండుకుని తేవాలనీ వేధించినట్లు ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో బాధిత మహిళ పేర్కొంది. తనకు న్యాయం చేయాలంటూ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ కు గ్రీవెన్స్ డే లో ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన జిల్లా ఎస్పీ శాఖపరమైన విచారణకు ఆదేశించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..