Hyderabad: ఖాకీలకు సలామ్.. టోయింగ్ వాహనంతో పేషంట్‌ను కాపాడిన పోలీసులు..

| Edited By: Shiva Prajapati

Jul 29, 2023 | 7:58 PM

Hyderabad: అయినా అంబులెన్స్‌ను కదిలించలేకపోయారు. దాంతో అక్కడున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ టోయింగ్ వాహన సిబ్బందికి ఫోన్ చేశాడు. నిమిషాల్లో అక్కడికి చేరుకున్న టోయింగ్ సిబ్బంది అంబులెన్స్ టోయింగ్ వాహనంతో జతపరిచారు. టోయింగ్ వాహనం వెళుతున్న వాటికి సాధారణంగానే సైరన్ సౌండ్ ఉంటుంది. దీనికి తోడు ఆ టోయింగ్ వాహనానికి అంబులెన్స్..

Hyderabad: ఖాకీలకు సలామ్.. టోయింగ్ వాహనంతో పేషంట్‌ను కాపాడిన పోలీసులు..
Police Towing Vehicle
Follow us on

హైదరాబాద్, జులై 29: రోడ్డుపై అంబులెన్స్ సౌండ్ వినపడగనే ప్రతి ఒక్కరూ అంబులెన్స్‌కు దారి ఇస్తుంటారు. ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే, అంబులెన్స్ స్ట్రక్ అయిందంటే ఎలాగైనా సరే దారి కల్పిస్తాం. కానీ హైదరాబాద్లో ఒక ఘటన చోటుచేసుకుంది. ఒక పేషెంట్ ను వెంటిలేటర్ మీద హాస్పిటల్‌కు, తరలిస్తున్న క్రమంలో దారి మధ్యలో వెళ్తున్న అంబులెన్స్ ఒకసారిగా బ్రేక్ డౌన్ అయిపోయింది. చాలా సేపటి వరకు అంబులెన్స్‌ను అక్కడ ఉండే యువకులు వెనుకవైపు నుంచి నెట్టే ప్రయత్నం చేశారు. అయినా అంబులెన్స్‌ను కదిలించలేకపోయారు. దాంతో అక్కడున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ టోయింగ్ వాహన సిబ్బందికి ఫోన్ చేశాడు. నిమిషాల్లో అక్కడికి చేరుకున్న టోయింగ్ సిబ్బంది అంబులెన్స్ టోయింగ్ వాహనంతో జతపరిచారు. టోయింగ్ వాహనం వెళుతున్న వాటికి సాధారణంగానే సైరన్ సౌండ్ ఉంటుంది. దీనికి తోడు ఆ టోయింగ్ వాహనానికి అంబులెన్స్ జతపట్టి లాగటంతో ట్రాఫిక్ పోలీసులు కూడా టోయింగ్ వాహనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

ఈ ఘటన హబ్సిగూడ మెట్రో స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ కు పేషంట్‌ను అంబులెన్స్‌లో తరలిస్తున్న క్రమంలో హబ్సిగూడ మెట్రో వద్దకు రాగానే అంబులెన్స్ ఒకసారిగా బ్రేక్ డౌన్ అయింది. హబ్సిగూడ నుండి సికింద్రాబాద్ యశోద వరకు 8 కిలోమీటర్లు ఉంటుంది. 23 నిమిషాల్లో అక్కడికి చేరుకోవాలి. కానీ కంప్లీట్‌గా అంబులెన్స్ బ్రేక్ డౌన్ అయిపోవడంతో పోలీసులు ఎలా అయినా సరే పేషెంట్ ప్రాణాలు కాపాడాలనుకున్నారు. వెంటనే టోయింగ్ వాహనంతో హబ్సిగూడ నుండి సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌కు అంబులెన్స్‌ను టోయింగ్ చేసుకుంటూ వచ్చారు పోలీసులు. ఘటనలో సహాయపడిన నల్లకుంట ట్రాఫిక్ పోలీసులకు, క్రేన్ సిబ్బందికి ప్రతి ఒక్కరూ అభినందనలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..