వరంగల్ సీపీ రంగనాథ్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను పోలీస్ అధికారుల సంఘం తప్పుబట్టింది. బండి సంజయ్ తన వైఖరి మార్చుకోవాలని సూచించింది. సీపీ రంగనాథ్ పై చేసిన వాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై గోపీరెడ్డి. వరంగల్ సీపీ రంగనాథ్ పై బండి సంజయ్ వ్యక్తిగత దూషణ చేయడం సరికాదన్నారు. ఏ కేసుల్లోనూ తమకు ప్రత్యేకంగా ప్రమాణం చేయాల్సిన అవసరం లేదన్నారు. విధుల్లో చేరినప్పుడే నిజాయితీ, నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తామన్నారు. ఏదైనా సమస్య ఉంటే న్యాయస్థానాల్లో తేల్చుకోవాలన్నారు.
ఇదిలావుంటే, రెండు రోజుల క్రితం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు చేసిన వ్యాఖ్యలను కూడా వై గోపీరెడ్డి తప్పుపట్టారు. గౌరవ ప్రదమైన చట్టసభలో సభ్యుడిగా ఉండి.. అభ్యంతరమైన భాష వాడడం హేయమన్నారు. అరెస్టు నిబంధనలు పాటించకుండా ప్రశ్నించవచ్చని, కోర్టును ఆశ్రయించవచ్చన్నారు.
కానీ, ఆటవిక భాషను ఉపయోగించి అత్యున్నత పదవిలో ఉన్న డీజీపీని అవమానకర, అభ్యంతరకర రీతిలో దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలీస్‌శాఖ అధిపతిని అసందర్భ వ్యాఖ్యలు చేస్తూ సిబ్బంది మనోధైర్యాన్ని, మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి చర్యలు మానుకోవాలన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం