Saibad Crime: అందుకే ఘోరాలు..! బాలిక ఫ్యామిలీకి విపక్ష నేతల పరామర్శ. పోలీసులు విఫలమయ్యారన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

|

Sep 13, 2021 | 7:23 PM

సైదాబాద్‌ సింగరేణి కాలనీలో మైనర్‌ అత్యాచారం, హత్యకు గురైన ఆరేళ్ల బాలిక కుటుంబాన్ని ఇవాళ కాంగ్రెస్‌, మజ్లిస్‌, బీఎస్పీ నేతలు

Saibad Crime: అందుకే ఘోరాలు..! బాలిక ఫ్యామిలీకి విపక్ష నేతల పరామర్శ. పోలీసులు విఫలమయ్యారన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Rs Praveen Kumar
Follow us on

Hyderabad Singareni Colony Girl: సైదాబాద్‌ సింగరేణి కాలనీలో మైనర్‌ అత్యాచారం, హత్యకు గురైన ఆరేళ్ల బాలిక కుటుంబాన్ని ఇవాళ కాంగ్రెస్‌, మజ్లిస్‌, బీఎస్పీ నేతలు పరామర్శించారు. కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, మజ్లిస్‌ ఎమ్మెల్యే అహ్మద్‌ పాషాఖాద్రి, బీఎస్పీనేత ప్రవీణ్‌కుమార్‌ బాలిక కుటుంబ సభ్యులను కలిశారు. సంఘటన జరిగి నాలుగైదు రోజులు గడుస్తున్నా మంత్రులు పరామర్శించకపోవడం దారుణమన్నారు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌.

సింగరేణికాలనీలో విచ్చలవిడిగా డ్రగ్స్‌, మద్యం అమ్మకాలు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి ఫాస్ట్‌ ట్రాక్‌కోర్టు ద్వారా కేసు విచారణ చేసి శిక్షపడేలా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో మందు, గంజాయి విచ్చలవిడిగా అమ్మకాలు జరుతున్నాయని..దానివల్లే అఘాయిత్యాలు పెరుగుతున్నాయని ములుగు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క అన్నారు.

అభం శుభం తెలియని చిన్నారి నరరూప రాక్షసుడి చేతిలో బలికావడం బాధ కలిగిస్తోందన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. బాలిక కుటుంబానికి అండగా ఉంటామన్నారు. యాకుత్‌పురా MLA పాషాఖాద్రి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సంఘటన చాలా బాధాకరమని..నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని సీపీకి విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబానికి డబుల్‌ బెడ్‌రూమ్‌, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

మరోవైపు మైనర్‌ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు రాజు కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితుడి వద్ద సెల్‌ఫోన్‌ లేకపోవడం, ఎలాంటి సోషల్‌ మీడియాను ఫార్మాట్‌ను ఉపయోగించకపోవడంతో ఆచూకీ లభ్యం ఆలస్యమవుతున్నట్లు సమాచారం. సిసి ఫుటేజీ, సొంతూరు, బంధువుల ఇళ్లలో గాలిస్తున్నారు.

Read also: Ganesh Immersion: గణేశ్ నిమజ్జనంపై ప్రభుత్వం వేసిన రివ్యూ పిటిషన్ కొట్టివేత.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు