Telangana: శాసనసభలోకి దూరిన పాము.. మీడియా పాయింట్ సమీపంలో కలకలం..!

తెలంగాణ శాసనసభ సమావేశాల సమయంలో తమ తమ సమస్యలను ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలకు చెప్పుకోవడానికి చాలా మంది వస్తారు. మరికొందరు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తారు. ఇంకొందరు అసెంబ్లీలోకి దూసుకెళ్తారు. ఈ కోవలో ఒకరు అసెంబ్లీలోకి దూసుకెళ్లారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో హల్‌చల్ చేశారు. దెబ్బకు అక్కడున్న వారంతా హడలిపోయారు.

Telangana: శాసనసభలోకి దూరిన పాము.. మీడియా పాయింట్ సమీపంలో కలకలం..!
Police Constable Catches Snake

Updated on: Mar 20, 2026 | 8:33 PM

తెలంగాణ శాసనసభ సమావేశాల సమయంలో తమ తమ సమస్యలను ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలకు చెప్పుకోవడానికి చాలా మంది వస్తారు. మరికొందరు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తారు. ఇంకొందరు అసెంబ్లీలోకి దూసుకెళ్తారు. ఈ కోవలో ఒకరు అసెంబ్లీలోకి దూసుకెళ్లారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో హల్‌చల్ చేశారు. దెబ్బకు అక్కడున్న వారంతా హడలిపోయారు.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శుక్రవారం (మార్చి 20) చాలా కీలకం. ఒక పక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు బడ్జెట్‌ ప్రవేశపెట్టే హడావుడిలో ఉన్నారు. మరోపక్క బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ పలు కార్యక్రమాలు చేపట్టారు. మీడియా పాయింట్‌లో అధికార, విపక్ష నేతలు మాట్లాడారు. వెళ్లిపోయారు.

ఇంతలో అసెంబ్లీలోకి వేగంగా దూసుకొచ్చింది పాము. రావడం రావడమే మీడియా పాయింట్‌లోకి వెళ్లిపోయింది. మీడియా పాయింట్ అంతా పాము తిరుగుతూ బుసలు కొట్టింది. పామును చూడగానే అక్కడున్న వారంతా హడలిపోయారు. అంతా పామును చూసి కంగారు పడిపోతుంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకటేశ్ నాయక్ ఎంట్రీ ఇచ్చారు. పామును చేతితో పట్టుకుని ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. దీంతో అప్పటివరకు అక్కడ టెన్షన్ పడుతున్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు.

అయితే పాము ఎంట్రీపై మాట్లాడుకున్నవారంతా ఎమ్మెల్యేలకు తన ప్రాబ్లం చెప్పుకుందామని వచ్చి ఉంటుందని చమత్కరించుకున్నారు. ప్రతీరోజు అసెంబ్లీని అధికార విపక్షాలు షేక్ చేస్తే.. అసెంబ్లీ ప్రాంగణాన్ని స్నేక్ షేక్ చేసింది.

వీడియో చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us