గ్రామాల్లో గంజాయి మూలాలు లేకుండా చేసేందుకు ఖాకీల నయా ఫ్లాన్..!

మావోయిస్టుల ఇలాకాలో ఇప్పుడు మత్తు పదార్థాలు కలవరపెడుతున్నాయి. యువత మత్తుకు చిత్తు కాకుండా ఖాకీలు ఊళ్లను జల్లడ పడుతున్నారు. ఒకవైపు స్నిఫర్ డాగ్స్‌తో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు, మరోవైపు అవగాహన ర్యాలీలతో యువత మత్తుకు బలి కాకుండా చైతన్య పరుస్తున్నారు. ములుగు జిల్లా ఏజెన్సీలో స్నిఫర్ డాగ్స్ గంజాయి మూలాలు పసిగట్టడంలో కీలకంగా మారాయి..

గ్రామాల్లో గంజాయి మూలాలు లేకుండా చేసేందుకు ఖాకీల నయా ఫ్లాన్..!
Police Camp

Edited By: Balaraju Goud

Updated on: Apr 17, 2025 | 7:38 PM

మావోయిస్టుల ఇలాకాలో ఇప్పుడు మత్తు పదార్థాలు కలవరపెడుతున్నాయి. యువత మత్తుకు చిత్తు కాకుండా ఖాకీలు ఊళ్లను జల్లడ పడుతున్నారు. ఒకవైపు స్నిఫర్ డాగ్స్‌తో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు, మరోవైపు అవగాహన ర్యాలీలతో యువత మత్తుకు బలి కాకుండా చైతన్య పరుస్తున్నారు. ములుగు జిల్లా ఏజెన్సీలో స్నిఫర్ డాగ్స్ గంజాయి మూలాలు పసిగట్టడంలో కీలకంగా మారాయి..

ల్యాండ్ మైన్స్, నేరస్తులను పసిగట్టడం, వీఐపీల భద్రతలో అత్యంత కీలకంగా వ్యవహరించే స్నిఫర్ డాగ్స్ విధులు మారాయా అంటే..! ఔననే అనిపిస్తుంది. గంజాయి, మత్తు పదార్థాలను పసిగట్టడంలో స్నిఫర్ డాగ్స్ పాత్ర అత్యంత కీలకంగా మారింది. మారుమూల పల్లెల నుండి పట్టణ ప్రాంతాలకు గంజాయి సరఫరా అవుతుందన్న సమాచారంతో గంజాయి మూలాలను పెకిలించేందుకు పోలీసులు ఊళ్లను జల్లడ పడుతున్నారు. ములుగు జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో స్నిఫర్ డాగ్స్ గంజాయి వాసన పసిగట్టడంలో ఖాకీలకు బ్రహ్మాస్త్రంగా మారాయి.

పోలీస్ జాగిలాలంటే ఎక్కువగా దొంగతనాలను పసిగట్టడంలో ఉపయోగిస్తారు. వీవీఐపీలు భద్రతలో స్నిఫర్ డాగ్స్ పోలీసులకు అత్యంత కీలక సేవలు అందిస్తాయి. కానీ ఇప్పుడు సీన్ మారింది. మత్తు పదార్థాలను పసిగట్టడంలో స్నిఫర్ డాగ్స్ సేవలు అత్యంత కీలకంగా మారాయి. గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలను పసిగట్టడంలో వాటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చిన పోలీస్ సిబ్బంది తనిఖీలు ముమ్మరం చేశారు. ఇలా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పబ్లిక్ పేస్‌లలో మొక్కుబడిగా తనఖీలు నిర్వహించడం కామన్.. కానీ ఇప్పుడు పోలీసుల ఫోకస్ అంతా గంజాయి సరఫరాపై పడింది. గంజాయి మూలాలు లేకుండా చేసేందుకు ఊళ్ళకు ఊళ్లను స్నిఫర్ డాగ్స్‌తో జల్లెడ పడుతున్నారు. ఇంటింటికి వెళ్లి పోలీస్ జాగిలాలతో తనిఖీలు చేస్తున్నారు.

ములుగు జిల్లా అంటేనే అత్యంత నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా ముద్రపడ్డ జిల్లా.. ఏజెన్సీలో నిత్యం మావోయిస్టుల ఆచూకీ కోసం జల్లెడ పట్టే పోలీసులు ఇప్పుడు స్నిఫర్ డాగ్స్‌తో గంజాయి వాసన పసిగట్టే పనిలో నిమగ్నమయ్యారు. గంజాయి మూలాలు లేకుండా పెకిలించి మత్తుబాబుల కిక్కు దించే పనుల పడ్డారు. ఒకవైపు యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే, మరోవైపు గంజాయి మూలాలు లేకుండా చేసేందుకు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఒకప్పుడు మావోయిస్టులకు పెట్టని కోటలుగా ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ఇప్పుడు గంజాయి మూలాలపై పోలీసులు విస్తృతంగా నిఘా పెరిగింది. విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లోకి వెళ్లి ఇళ్లిళ్లు తనిఖీ చేస్తున్నారు. వ్యాపార సముదాయాలు, పాన్ షాప్స్, కిరాణా దుకాణాలు, చిరు వ్యాపారుల వద్ద జాగిలాలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా మత్తు పదార్థాలు అమ్మినా, సేవించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ, గంజాయి విక్రయాలపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

వీడియో చూడండి.. 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..